Chicken Pulao : చికెన్ పులావ్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. బాగుంటుంది..

Chicken Pulao : చికెన్ తో ర‌క‌ర‌క‌ల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చికెన్ తో చేసే వంట‌కాల్లో చికెన్ పులావ్ ఒక‌టి. చికెన్ పులావ్ అన‌గానే చాలా మంది నోట్లో నీళ్లురుతుంటాయి. శ్ర‌మ అలాగే స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని చాలా మంది ఈ చికెన్ పులావ్ ను బ‌య‌ట హోట‌ల్స్ లో తింటూ ఉంటారు. ఎటువంటి శ్ర‌మ లేకుండా రుచిగా అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ఈ పులావ్ ను మ‌నం కుక్క‌ర్ లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, మొద‌టి సారి చేసే వారు కూడా ఈ పులావ్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కుక్క‌ర్ లో రుచిగా చికెన్ పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్క‌ర్ లో చికెన్ పులావ్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, నానబెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 6, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచ ముక్క‌, బిర్యానీ ఆకు – 1, సాజీరా- ఒక టీ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మ‌టా – 1, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, తరిగిన ప‌చ్చిమిర్చి – 3, పెరుగు – పావు క‌ప్పు,త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన పుదీనా – ఒక టేబుల్ స్పూన్, రోజ్ వాట‌ర్ – అర టీ స్పూన్.

Chicken Pulao recipe in telugu make like this tastes better
Chicken Pulao

కుక్క‌ర్ లో చికెన్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి ఉప్ఉ నీటిలో వేసి అర‌గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఈ ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ ను వేసి నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు, బాస్మ‌తీ బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి పెద్ద మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వెంట‌నే మూత తీయ‌కుండా అర గంట పాటు అలాగే ఉంచాలి.

అర గంట త‌రువాత మూత తీసి రోజ్ వాట‌ర్ ను చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో లేదా స్పెష‌ల్ డేస్ కు ఇలా చాలా సులువుగా పులావ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక ముక్క కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఈ పులావ్ ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts