Gas Trouble : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ ఒకటి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో నేటి కాలంలో చాలా మంది అనేక ఇబ్బందులు పడతున్నారు. గ్యాస్, ఉడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉడికించిన ఆహారాలు తీసుకునే వారిలో రోజుకు ఒక లీటర్ మోతాదులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇలా తయారయిన గ్యాస్ ఎప్పటికప్పుడు త్రేన్పుల రూపంలో, అపార వాయువు రూపంలో బయటకు వెళ్లిపోతే ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఈ గ్యాస్ బయటకు వెళ్ల కుండా పొట్టలేనే ఉండడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇలా పొట్టలో తయారయిన గ్యాస్ బయటకు పోకపోవడానికి మలబద్దకం కూడా ఒక కారణమవుతుంది. మలబద్దకం వల్ల గ్యాస్ బయటకు పోకుండా మనల్ని ఇబ్బంది గురి చేస్తుంది. అలాగే పొట్ట నిండుగా భోజనం చేసినా కూడా గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. పొట్ట నండుగా భోజనం చేయడం వల్ల కడుపులో తయారయిన గ్యాస్ ఎటు వెళ్లాలో తెలియక మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అదే విధంగా పొట్టకు విశ్రాంతి ఇవ్వకుండా తిన్న ఆహారం జీర్ణంకాక ముందే మరలా ఆహారాన్ని తినడం వల్ల కూడా గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అలాగే ఆకలి కాకముందే భోజనం చేసినా కూడా గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుంది. ఆకలి బాగా వేసినప్పుడే మన పొట్టలో జీర్ణరసాలు ఎక్కువగా తయారవుతాయి. ఆకలి వేయకుండా మనం భోజనం చేయడం వల్ల జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తికాక మనం తిన్న ఆహారం ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.
దీంతో పొట్టలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్య తలెత్తగానే బయట మార్కెట్ లో లభించే సిరప్ లను, పొడులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినా వీటిని దీర్ఘకాలం పాటు వాడడం అంత మంచిది కాదు. కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతున్నప్పుడు నీటిని వేడి చేసుకుని కప్పులో పోసుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే లవంగాలను, యాలకులను నీటిలో వేసి మరింగిచి వడకట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే వాము లేదా జీలకర్రతో చేసిన కషాయాలను తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నోట్లో యాలక్కాయను వేసుకుని చప్పిరస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే మలబద్దకం సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు మూడు పూటలా మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని ఎక్కువగా నమిలి మింగాలి. సులువుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు, చప్పటి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల భవిష్యత్తులో గ్యాస్ సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.