Chilli Chicken : రెస్టారెంట్ల‌లో ల‌భించే చిల్లీ చికెన్‌.. ఇంట్లోనూ ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..

Chilli Chicken : మ‌న‌కు బ‌య‌ట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద, ఫాస్ట్ ఫుడ్ పెంట‌ర్ల‌లలో ర‌క‌ర‌కాల చికెన్ వంట‌కాలు ల‌భిస్తూ ఉంటాయి. ఇలా ల‌భించే చికెన్ వంట‌కాల్లో చిల్లీ చికెన్ ఒక‌టి. చిల్లీ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ చిల్లీ చికెన్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మొద‌టిసారి చేసేవారు, బ్యాచిల‌ర్స్, వంటరాని వారు కూడా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ లో చిల్లీ చికెన్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఉల్లిపాయ త‌రుగు – రెండు టేబుల్ స్పూన్స్, పెట‌ల్స్ ఆకారంలో త‌రిగిన క్యాప్సికం – 1, పెట‌ల్స్ ఆకారంలో త‌రిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – ముప్పావు క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్స్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

Chilli Chicken recipe in telugu very easy how to make
Chilli Chicken

చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన బోన్ లెస్ చికెన్ – 300 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ముప్పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కోడిగుడ్డు మిశ్ర‌మం – 2 టీ స్పూన్స్, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా నీళ్లు లేకుండా చికెన్ ను తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత అల్లం పేస్ట్, గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత కోడిగుడ్డు మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. త‌రువాత మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చికెన్ కు ప‌ట్టించాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చికెన్ ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత క‌ళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక వెల్లుల్లి త‌రుగు, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత క్యాప్సికం, ఉల్లిపాయ ముక్క‌లు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి మ‌రిగించాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు మ‌రిగించాలి. త‌రువాత వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన చికెన్ ను వేసి పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి. సాసెస్ ద‌గ్గ‌ర ప‌డ‌గానే కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చిల్లీ చికెన్ త‌యార‌వుతుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే చిల్లీ చికెన్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. చికెన్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఈ విధంగా చిల్లీ చికెన్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts