వినోదం

Chiranjeevi Balakrishna Photo : చిరంజీవి శోభ‌నం గ‌దిలోకి వెళ్లిన బాల‌య్య‌.. వైర‌ల్ అవుతున్న ఫొటో వెనుక ఉన్న అస‌లు స్టోరీ ఇదే..!

Chiranjeevi Balakrishna Photo : సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక సినీ సెల‌బ్రిటీల‌కు సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్న నాటి సంగ‌తులు, అప్ప‌టి షూటింగ్ విశేషాలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా చిరు శోభ‌నం గ‌దిలో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో కూర్చుని ఉంటే అత‌ని ప‌క్క‌నే కూర్చున్న బాల‌య్య స‌ర‌దాగా మాట్లాడుతున్న ఫోటో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చిరు శోభ‌నం గ‌దిలో బాల‌య్య‌కు ఏం ప‌ని అని కొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదులేండి. రీల్ లైఫ్‌లో.

చిరంజీవి హీరోగా న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో ఘ‌రానా మొగుడు ఒక‌టి. ఈ సినిమాకు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఓపెనింగ్ సీన్‌గా ఇంట‌ర్వెల్ సీన్‌ను చిత్రీక‌రించ‌గా, అందులో చిరంజీవి శోభ‌నం పెళ్లి కొడుకు గెట‌ప్‌లో ఉండి న‌గ్మాతో ఛాలెంజ్ చేసే స‌న్నివేశమ‌ది. ప్రారంభోత్స‌వ స‌మ‌యంలో బాల‌కృష్ణ అతిథిగా విచ్చేయ‌డంతో గ్యాప్ లో ఇద్ద‌రు క‌లిసి అక్క‌డున్న మంచం మీద‌నే కూర్చుని స‌ర‌దాగా మాట్లాడుకుంటున్నారు. ఆ నాటి పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే బాల‌కృష్ణ‌ది లక్కీ హ్యాండ్ అనే సెంటిమెంట్ పరిశ్రమలో ఉండేది.

Chiranjeevi Balakrishna Photo do you know the story behind it

అందుకే అప్ప‌ట్లో ఆయ‌న చాలా సినిమాల‌కు గెస్ట్‌గా హాజ‌ర‌య్యేవారు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం చిత్ర లాంచింగ్ ఈవెంట్ కి హాజరైన బాలకృష్ణ పవన్ పై క్లాప్ కొట్టారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ హిట్ సుస్వాగతం కావడం విశేషం. ఇప్ప‌టికి బాల‌య్య ప‌లు హీరోల వేడుక‌ల‌కి హాజ‌ర‌వుతూ సంద‌డి చేస్తుంటారు.

Admin

Recent Posts