వినోదం

Sai Pallavi : విజ‌య‌శాంతి, సాయిప‌ల్ల‌వికి మధ్య ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా..?

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీని రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కేవలం ఆమె కోసమే థియేటర్ కి వచ్చే ఫ్యాన్స్ ఉండడం విశేషం.

ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి ఏవిధంగా క్రేజ్ ఉందో అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి కూడా అలాగే ఉండేది. చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఓసేయ్ రాములమ్మా తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డున్నీ బద్దలు కొట్టింది. అప్పట్లో విజ‌య‌శాంతిని కూడా లేడీ సూప‌ర్ స్టార్ అని పిలిచేవార‌ట‌. ఇప్పుడు సాయి ప‌ల్ల‌విని కూడా అలాగే సంబోధిస్తుంటారు.

what is the relation between sai pallavi and vijaya shanthi

సాయిప‌ల్ల‌వికి ముందు త‌రువాత చాలామంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఈమె అంత క్రేజ్ ఏ హీరోయిన్‌కు రాలేదు. సాయిప‌ల్ల‌వికి పెద్ద పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రాన‌ప్ప‌టికీ ఆ స్థాయిలో పాపులారీటిని సంపాదించుకోవ‌డం మాత్రం సాయిప‌ల్ల‌వికే సాధ్య‌మ‌ని చెప్పవ‌చ్చు. ఈమె త‌న ఒక్క సినిమాకు 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుంది. ఇక హీరోయిన్ సాయిప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్ చూస్తే స్టార్ హీరోలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొత్తానికి అప్ప‌ట్లో విజ‌య‌శాంతికి ఉన్న క్రేజ్ ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి ద‌క్కింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts