వినోదం

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

Mutyala Muggu Movie : దర్శకుడు బాపు.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, ఆ కళాఖండంలో తాము కూడా ఒక భాగం కావాలని నటీనటులంతా అనుకుంటారు. ఆయన తీసిన అద్భుతమైన కళాత్మక చిత్రాలు చూసి జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయేవారు. మూవీలో సహజత్వం ఉట్టిపడేలా బాపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన అప్పట్లో వర్తమాన నటీనటులతో తీసిన గొప్ప చిత్రం ముత్యాల ముగ్గు. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. సుమారుగా ఈ చిత్రం తీయడానికి మేకర్స్ కు రూ.12 లక్షలు ఖర్చు అయిందట.

ఇక ఈ సినిమా అప్పట్లోనే రూ.2 కోట్ల‌కు పైగా వ‌సూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీధర్ హీరోగా న‌టించ‌గా సంగీత హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా అప్ప‌టికి పెద్ద‌గా గుర్తింపు లేని రావుగోపాల్ రావును విల‌న్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేకుండానే తెర‌కెక్కించ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేద‌ని తెలియ‌డంతో సినిమాను కొనేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. ఈ సినిమా పూర్త‌యి మొద‌టి కాపీ రాగేనే ఎన్టీరామారావుకు చూపించారు.

muthyala muggu movie collections

సినిమా చూసిన ఎన్టీఆర్ మా రోజులు గుర్తుచేశావ్ బ్రద‌ర్ అంటూ బాపూను అభినందించార‌ట‌. అయిన‌ప్ప‌టికీ సినిమాపై అంచ‌నాలు లేక‌పోవ‌డంతో త‌క్కువ థియేట‌ర్ ల‌లో విడుద‌ల చేశారు. అవి కూడా పాత థియేట‌ర్ ల‌లోనే సినిమాను వేసుకున్నారు. మ‌హా అయితే ఈ సినిమా 4 రోజులు ఆడుతుందేమో అనే భావ‌న‌లో చిత్ర యూనిట్ ఉందట. సినిమాకు ప‌బ్లిసిటీ కూడా చేయ‌లేదు. కానీ ఈ సినిమాకు వ‌స్తున్న టాక్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఫస్ట్ వీక్ నుండి క‌లెక్ష‌న్ ల జోరు పెరిగింది. ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చ‌డంతో కోట్ల‌ల్లో వ‌సూలు చేసింది.

Admin

Recent Posts