వినోదం

Chatrapathi Movie : ఛ‌త్ర‌ప‌తిలోని ఆ సీన్ రాజ‌మౌళికి ఇప్ప‌టికీ న‌చ్చ‌ద‌ట‌.. మ‌రి ఎందుకు తీసిన‌ట్లు..?

Chatrapathi Movie : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి వైవిధ్య‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో చెర‌గిని ముద్ర వేసుకున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇక ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో హాలీవుడ్ ప్ర‌ముఖుల విమ‌ర్శ‌లు కూడా పొందాడు. అయితే రాజ‌మౌళి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఉండ‌గా, అందులో ఛ‌త్ర‌ప‌తి కూడా ఒక‌టి. వర్షం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్‌కు ‘ఛత్రపతి’ సినిమా స్టార్ హీరోగా అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆరో చిత్రం ‘ఛత్రపతి’. దర్శకుడిగా రాజమౌళికి ఇది 4వ మూవీ. నితిన్‌తో ‘సై’ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

రాజ‌మౌళి ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటుండ‌గా, ప‌లుమార్లు అది సాధ్యం కాలేదు. అయితే చివ‌రిగా ఛ‌త్ర‌ప‌తి పేరుతో సినిమా చేశాడు. అమ్మ సెంటిమెంట్ మ‌రియు యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలోని చాలా సీన్లు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాయి. ‘ఛత్రపతి’ సినిమాకు రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. కీరవాణి సంగీతం అందించారు. బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించారు. శ్రియ కథానాయికగా నటించారు.

rajamouli did not like this scene in chathrapathi

సినిమాలో కాట్రాజ్, ప్ర‌భాస్ ల మ‌ధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాట్రాజ్ పాత్ర కోసం రాజ‌మౌళి ముందుగా కొంత‌మందిని స్క్రీన్ టెస్ట్ చేసిన, ప్ర‌భాస్ క‌టౌట్ కు స‌రిపోయేలా ఎవ‌రు దొర‌క‌లేదు. చివ‌రికి సై సినిమాలో 10 మందిలో ఒక‌డిగా ఉన్న సుప్రీమ్ ను సెల‌క్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ మాత్రం రాజ‌మౌళికి న‌చ్చ‌లేద‌ట‌. ఎన్ని ప్యాచ్ వ‌ర్క్‌లు చేసిన తాను అనుకున్నంత‌గా రాలేద‌ట‌. అయిన‌ప్ప‌టికీ అలానే రిలీజ్ చేశాడు. ఈ మూవీ ఇక ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Admin

Recent Posts