Cold Coffee : రెస్టారెంట్ల‌లో ల‌భించే కోల్డ్ కాఫీని.. ఇంట్లో ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Cold Coffee : మ‌న‌కు కాఫీ షాపుల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల కాఫీల‌లో కోల్డ్ కాఫీ కూడా ఒక‌టి. ఈ కోల్డ్ కాఫీ చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే ఈ కోల్డ్ కాఫీ ధ‌ర కాఫీ షాపుల‌ల్లో చాలా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకుని తాగ‌డం మంచిది. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే కోల్డ్ కాఫీని ఇంట్లోనే సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కోల్డ్ కాఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి పాలు – ఒక క‌ప్పు, కాఫీ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, చాక్లెట్ సిర‌ప్ లేదా కోకో పౌడ‌ర్ – ఒక టీ స్పూన్,పంచ‌దార – 3 టీ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – 5.

Cold Coffee recipe in telugu make in this method
Cold Coffee

కోల్డ్ కాఫీ త‌యారీ విధానం..

ముందుగా పాల‌ను కాచి చ‌ల్లార్చుకోవాలి. త‌రువాత వీటిని ఫ్రిజ్ లో చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో కాఫీ పొడిని తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో లేదా బ్లెండ‌ర్ లో చ‌ల్ల‌టి పాలు, కాఫీ పొడి క‌లిపిన నీళ్లు, చాక్లెట్ సిర‌ప్, పంచ‌దార‌, ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. త‌రువాత స‌ర్వ్ చేసుకునే గ్లాస్ ను లేదా క‌ప్పును తీసుకుని దానికి చుట్టూ చాక్లెట్ సిర‌ప్ ను వేసుకోవాలి. త‌రువాత తయారు చేసుకున్న కాఫీని పోసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కోల్డ్ కాఫీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు. బ‌య‌ట ఎక్కువ డ‌బ్బుల‌కు కొనుగోలు చేసి తాగ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే కోల్డ్ కాఫీని త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు.

D

Recent Posts