Body Part : మనం అనేక రకాల కూరగాయలను, పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను, గింజలను, విత్తనాలను, దుంపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని రకాల ఆహారాలు మన శరీరంలో అవయవాలను పోలి ఉంటాయి. ప్రకృతిని బాగా గమనించిన మూలికా శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. అలాగే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఆయా అవయవాలకు ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. కనుక శరీరంలో ఏ అవయవం ఏ ఆహారాన్ని పోలి ఉంటుందో దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఎప్పుడైనా గుండ్రంటి ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ను గమనించారా.. ఇది అచ్చం మన కనుగుడ్డు వలె ఆకారాన్ని, చారలను కలిగి ఉంటుంది. అలాగే క్యారెట్ ను తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మన గుండె మనం ఆహారంగా తీసుకునే టమాట వలె ఉంటుంది. గుండెలో నాలుగు గదులు ఉన్నట్టు టమాటాలో కూడా నాలుగు గదులు అది కూడా ఎరుపు రంగులో ఉంటాయి. టమాటాలను ఆహారంగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మనం ఆహారంగా తీసుకునే ద్రాక్ష పండ్లు ఊపిరితిత్తుల అల్వియోలీని పోలి ఉంటాయి.
ఊపిరితిత్తుల్లో ఉండే ఈ నిర్మాణాలు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ రక్తంలో కలిసేలా చేయడంలో సహాయపడతాయి. అదే విధంగాద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎంఫిసెమా వంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్ నట్స్ కూడా ఒకటి. ఇవి అచ్చం మన మెదడును పోలి ఉంటాయి. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాచార వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మెదడు చురకుగా, ఆరోగ్యవంతంగా పని చేస్తుంది. అదే విధంగా మనం ఆహారంగా తీసుకునే గింజలల్లో రాజ్మా కూడా ఒకటి. ఇవి మన శరీరంలో మూత్రపిండాల ఆకారాన్ని, రంగును కలిగి ఉంటాయి.
రాజ్మాను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడంలో, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా రాజ్మా మనకు దోహదపడుతుంది. అలాగే అవకాడోలను మనం ఆహారంగా తీసుకుంటాము. నిలువుగా కట్ చేసిన అవకాడోను గమనించినట్టయితే అది స్త్రీ గర్భాశయంలో భాగమైన స్త్రీబీజ కోశాలు( ఓవరీ) వలె ఉంటాయి. అవకాడోలను తీసుకోవడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వారానికి ఒక అవకాడోను తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గడంతో పాటు గర్బాశయ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదే విధంగా మనం ఆహారంగా తీసుకునే కందగడ్డ మన శరీరంలో ఉండే ప్రాంకియాసిస్ గ్రంథిని పోలి ఉంటుంది. కందగడ్డను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రాంకియాసిస్ గ్రంథి పని తీరు మెరుగుపడి రక్తంలో చక్కె స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే విధంగా మనం ఆహారంగా తీసుకునే ఆలివ్ లు స్త్రీలల్లో ఉండే అండాశయాల మాదిరి ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 30 శాతం తక్కువగా ఉన్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లగించారు.
అలాగే అడ్డంగా కట్ చేసిన నారింజ పండ్లు స్త్రీలల్లో ఉండే క్షీర గ్రంథుల వలె ఉంటాయి. నారింజ పండ్లను తీసుకోవడం వ్లలరొమ్ము ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రొమ్ము లోపల మరియు బయట శోషరస కదలికలు కూడా చక్కగా ఉంటాయి. ఇక మనం ఆహారంగా తీసుకునే అరటి పండు మన చిరునవ్వును సూచిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది జీర్ణం అయిన తరువాత సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్ గా మారుతుంది. ఇది మన మెదడు మానసిక స్థితిని మెరుగుపరిచి మనం సంతోషంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.
అలాగే అడ్డంగా కట్ చేసిన ఉల్లిపాయ మన శరీరకణాలను పోలి ఉంటుంది. ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీర కణాలలో ఉండే వ్యర్థాలు తొలగిపోయి వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మనం తీసుకునే అల్లం మన జీర్ణాశయం వలె కనిపిస్తుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. వికారం, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో అల్లం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే నిలువుగా కట్ చేసిన పుట్టగొడుగులు మన చెవి ఆకారంలో ఉంటాయి. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల వినికిడి సామర్థ్యం పెరుగుతుంది.
వినికిడి లోపాలు తగ్గడంతో పాటు మెదడుకు ధ్వనిని ప్రసారం చేసే చెవిలో ఉండే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే బ్రోకలీ క్యాన్సర్ కణాలను పోలి ఉంటుంది. బ్రోకలీని ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా జిన్సెంగ్ దుంప.. దీనిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. ఇది అచ్చం మానవ శరీరం వలె కనిపిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా శరీరంలో ఏ అవయవానికి ఏ ఆహారం మేలు చేస్తుందో ప్రకృతి మనకు ముందుగానే సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.