Corn Pakora : మొక్క‌జొన్న ప‌కోడీలు.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి..!

Corn Pakora : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో కార్న్ ప‌కోడా కూడా ఒక‌టి. ఈ ప‌కోడాలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ప‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్వీట్ కార్న్ తో రుచిగా, క్రిస్పీగా ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్న్ ప‌కోడా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స్వీట్ కార్న్ గింజ‌లు – ఒక క‌ప్పు, బియ్యం పిండి – అర క‌ప్పు, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం – ఒక ఇంచు ముక్క‌, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Corn Pakora recipe in telugu make in this way
Corn Pakora

కార్న్ ప‌కోడా త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో కార్న్ గింజ‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో క‌రివేపాకు, అల్లం, ప‌చ్చిమిర్చి, జీల‌క‌ర్ర‌ వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర‌, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఈ ప‌కోడీల‌ను ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత గంటెతో అటూ ఇటూ క‌దుపుతూ వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ప‌కోడా త‌యార‌వుతుంది. వీటిని చట్నీ, ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు ఇలా రుచిగా, వేడి వేడిగా ప‌కోడీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటే మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

Share
D

Recent Posts