Corn Paneer Kofta : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ క‌ర్రీని ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Corn Paneer Kofta : కార్న్ ప‌నీర్ కోప్తా కర్రీ.. మొక్క‌జొన్న గింజ‌లు, ప‌నీర్ క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అన్నం, చ‌పాతీ ఇలా దేనిలోకైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా, తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి రుచితో ఉండే ఈ కార్న్ ప‌నీర్ కోఫ్తా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్న్ ప‌నీర్ కోఫ్తా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

లేత మొక్క‌జొన్న గింజ‌లు – రెండు క‌ప్పులు, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, ట‌మాట ఫ్యూరీ – ఒక క‌ప్పు, ప‌నీర్ తురుము – అర క‌ప్పు, గ‌రం మ‌సాలా -ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు -త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్,చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్.

Corn Paneer Kofta curry recipe in telugu very easy to make
Corn Paneer Kofta

కార్న్ ప‌నీర్ కోఫ్తా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మొక్క‌జొన్నగింజ‌ల‌ను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌నీర్ తురుము, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కోఫ్తాల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌రకు వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ, ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత ధ‌నియాల పొడి, ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత వేయించిన కోఫ్తాల‌ను, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ప‌ది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ప‌నీర్ కోఫ్తా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ప‌నీర్ తో త‌ర‌చూ ఒకేరకం కూర‌లు ఇలా కోఫ్తా క‌ర్రీని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts