Teeth Cavity : పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం.. ఇలా చేయాలి..

Teeth Cavity : మ‌న‌లో చాలా మంది పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తూ ఉంటుంది. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే బాధ‌, నొప్పి అంతా ఇంతా కాదు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కారణం మ‌న నోటిలో చెడు బ్యాక్టీరియా పేరుకుపోవ‌డ‌మే. మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాఫీ, టీ ల‌ను ఎక్కువ‌గా తాగ‌డం, చ‌క్కెర ఉండే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, శీత‌ల పానీయాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, జంక్ పుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఫైబ‌ర్ ఉండే ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డ‌మే దంతాలు పుచ్చిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.

మ‌న నోట్లో ఉండే బ్యాక్టీరియా మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే చ‌క్కెర‌ల‌తో క‌లిసి మ‌రింతగా వృద్ది చెందుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాల‌పై పేరుకుపోయి దంతాలు గార ప‌ట్టేలా, దంతాలు పుచ్చిపోయేలా చేస్తుంది. దంతాలపై గార పోగొట్టుకోవ‌డానికి, పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌ను తొల‌గించుకోవ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడుతూ ఉంటాము. కానీ ఎటువంటి ఫ‌లితం లేక మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. టూత్ పేస్ట్ ల‌ను వాడే అవ‌స‌రం లేకుండా చాలా త‌క్కువ ఖ‌ర్చులో స‌హ‌జంగా ల‌భించే ప‌దార్థాన్ని ఉప‌యోగించి మ‌నం పిప్పి ప‌న్ను స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

sweet lime is the best remedy for Teeth Cavity
Teeth Cavity

పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో బ‌త్తాయి పండు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని వారు చెబుతున్నారు. అయితే బ‌త్తాయి జ్యూస్ ను తాగితే మ‌నం ఈ ఫ‌లితాన్ని పొంద‌లేము. చ‌క్క‌గా పండిన తియ్య‌టి బ‌త్తాయి తొన‌ల‌ను న‌మిలి తింటేనే మ‌నం ఈ ఫ‌లితాన్ని పొంద‌గ‌ల‌ము. బ‌త్తాయిలో ఉండే ఆమ్ల‌త్వం నోట్లో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను తొల‌గించి, దంతాలు పుచ్చిపోకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దీనిలో ఉండే ఫైబ‌ర్ దంతాల‌పై ఉండే గార‌ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. బ‌త్తాయి తొన‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల దంతాల‌పై పేరుకుపోయిన గార‌ తొల‌గిపోతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోరు శుభ్ర‌ప‌డుతుంది.

దంతాలు పుచ్చిపోవ‌డం, గార‌ ప‌ట్ట‌డం, నోటి దుర్వాస‌న వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బ‌త్తాయి తొన‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య తగ్గుతుంది. ప్రేగులు శుభ్ర‌ప‌డ‌తాయి. ఈ విధంగా బ‌త్తాయి తొన‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల పిప్పి ప‌న్ను స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో రాకుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పిప్పి ప‌న్ను స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉద‌యం పూట రెండు బ‌త్తాయిల‌ను, రాత్రి భోజ‌న స‌మ‌యంలో రెండు బత్తాయిల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts