Dates In Winter : చలికాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కనుక మనం చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలను కూడా తీసుకోవాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మనకు ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని చలికాలంలో మనం తప్పకుండా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరం బలంగా, శక్తివంతంగా తయారవుతుంది. చలికాలంలో ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరం అంతర్గతంగా వెచ్చగా ఉంటుంది.
ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మనం వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకంతో బాధపడే వారు రోజూ రాత్రి పడుకునే ముందు రెండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఖర్జూరాలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. వ్యాయామాలు చేసే వారు, ఆటలు ఆడే వారు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. కనుక చలికాలంలో రోజూ రెండు ఖర్జూరాలను తప్పకుండా తీసుకోవాలని వీటిని తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే అనారోగ్యసమస్యల బారిన పడకుండా మరియు చలి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.