Pineapple Lassi : ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన పైనాపిల్ ల‌స్సీ.. త‌యారీ ఇలా..!

Pineapple Lassi : పైనాపిల్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూఉంటాము. పైనాపిల్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. పైనాపిల్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుప‌డుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ఇలా అనేక ర‌కాలుగా పైనాపిల్ మ‌న‌కు మేలు చేస్తుంది. చాలా మంది దీనిని నేరుగా తింటూ ఉంటారు. అలాగే జ్యూస్ చేసి తీసుకుంటారు. వీటితో పాటు పైనాపిల్ తో ఎంతో రుచిగా ఉండే ల‌స్సీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పైనాపిల్ తో చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క చుక్క కూడా విడిచిపెట్టకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు. పైనాపిల్ తినని పిల్ల‌ల‌కు ఇలా ల‌స్సీని చేసి ఇవ్వ‌డం వ‌ల్ల వారికి పోష‌కాల‌న్నీ చ‌క్క‌గా అందుతాయి. పైనాపిల్ తో రుచిగా, క‌మ్మ‌గా ల‌స్సీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్ ల‌స్సీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మందంగా గుండ్రంగా క‌ట్ చేసిన పండిన పైనాపిల్ ముక్క‌లు – 4, ఉప్పు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, పంచ‌దార – 2 టీ స్పూన్స్, చ‌ల్ల‌టి క‌మ్మ‌టి పెరుగు – 400 ఎమ్ ఎల్, ఐస్ క్యూబ్స్ – 5.

Pineapple Lassi recipe in telugu make in this method
Pineapple Lassi

పైనాపిల్ ల‌స్సీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో పైనాపిల్ ముక్క‌లు వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, నిమ్మ‌ర‌సం, పంచ‌దార వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను క‌ళాయిలో వేసి అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ముక్క‌లు వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే పెరుగు, ఐస్ క్యూబ్స్, మ‌రో 2 టేబుల్ స్పూన్ల పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ ల‌స్సీ త‌యార‌వుతుంది. పైనాపిల్ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ ల‌స్సీని ఇష్టంగా తాగుతారు.

D

Recent Posts