Detergent With Salt : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం వంట పాత్రలపై ఉండే మాడిన మరకలన్నింటిని, నూనె మరకలన్నింటిని చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఈచిట్కాను వాడడం వల్ల వంట పాత్రలు కొత్త వాటి వలె తళతళ మెరిసిపోతాయి. మనం ఒక్కొసారి కూరలు వండుతూనే స్టవ్ మీద ఉంచి మరిచిపోతూ ఉంటాము. పాలను కూడా స్టవ్ మీద ఉంచి మరిచిపోతాము. దీంతో పాలు పొంగడంతో పాటు గిన్నెలకు మరకలు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి ఎంత ప్రయత్నించినప్పటికి ఈ మరకలు పోవు. అలాంటప్పుడు ఈచిట్కాను వాడడం వల్ల మరకలు చాలా సులభంగా తొలగిపోతాయి. గిన్నెలపై మరకలను తొలగించి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ఒక గిన్నెలో లిక్విడ్ డిజర్జెంట్ ను ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక కప్పు నీళ్లను పోయాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పును, ఒక టేబుల్ స్పూన్ వంటసోడాను వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని డబ్బాలో పోసుకుని నిల్వ ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో గిన్నెలను శుభ్రం చేయడం వల్ల గిన్నెలపై ఉండే మరకలన్నీ తొలగిపోతాయి. గిన్నెలు కొత్తవాటి వలె తయారవుతాయి. అలాగే ఈ లిక్విడ్ తో మనం సింక్ ను, స్టవ్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
సింక్ లో ఉండే జిడ్డు, మురికి, నీటి మరకలు తొలగిపోయి సింక్ కొత్తగా తయారవుతుంది. అలాగే ఈ లిక్విడ్ తో మనం టాయిలెట్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు. దీనితతో టాయిలెట్ ను శుభ్రం చేయడం వల్ల టాయిలెట్ పై ఉండే పసుపు మరకలు తొలగిపోయి టాయిలెట్ తెల్లగా వస్తుంది. ఈ విధంగా మనకు సులభంగా లభించే వాటితో లిక్విడ్ ను తయారు చేసుకుని వాడడం వల్ల మన వంట పాత్రలను తళతళ మెరింపుచుకోవచ్చు.