Devara Movie Trailer Records : దేవ‌ర దెబ్బ‌కి షేక్ అవుతున్న యూట్యూబ్.. ట్రైల‌ర్ ఎన్ని వ్యూస్ రాబ‌ట్టింది అంటే..?

Devara Movie Trailer Records : ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నుండి వ‌స్తున్న చిత్రం దేవ‌ర‌.ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ ఉన్నాయి.. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఊర్ మాస్ లుక్‏లో యాక్షన్ అదరగొట్టేశాడు తారక్. ఈ చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్లు ట్రైలర్ తో తెలియజేశారు.ఇక ఇందులో ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తారక్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో జాన్వీ క‌థానాయిక‌గా న‌టించింది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మూడు పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. సినిమా ట్రైలర్ ని ముంబైలో నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో ట్రైలర్ లాంచ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక దేవర ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని, సినిమాపై పదింతలు అంచనాలు పెంచుతుందని నందమూరి అభిమానులు భావించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు మొత్తం తలకందులయ్యాయి. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేయగా, భారీ వ్యూస్, లైక్స్ వస్తాయని అనుకున్నా, ఎప్పుడైతే 100k లైక్స్ మిస్ అయిందో అప్పుడే దేవర ట్రైలర్ పై దెబ్బపడింది. ఇక 24 గంటలు ముగిసే సరికి దేవర ఓవరాల్ గా 10.38M మిలియన్ల వ్యూస్ ని, 658.8K లైక్స్ మాత్రమే సాధించింది.

Devara Movie Trailer Records creating sensation on youtube
Devara Movie Trailer Records

అయితే ట్రైల‌ర్ 35 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిన‌ట్టు మేక‌ర్స్ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.మూవీ రిలీజ్ కు ముందే 1 మిలియన్ డాలర్లను చేరుకున్న తొలి టాలీవుడ్ సినిమాగా దేవర రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అదరగొట్టేశాడు అనిరుధ్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

Sam

Recent Posts