Viral Video : కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఏం చేస్తారో అస్సలు అర్ధం కాని పరిస్థితి. అయితే తాజాగా ఓ ఘనుడు స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ మొత్తాన్ని తగలబెట్టాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల చాలా మంది ఓలా ఎలక్రిక్ స్కూటర్స్ వాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాటిపై ఫిర్యాదులు కూడా ఎక్కువే. ఓలా స్కూటర్‌లో తరచూ లోపలు తలెత్తుతున్నాయని ఆగ్రహించిన ఓ వ్యక్తి కంపెనీ షోరూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా షోరూమ్ కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.
కర్ణాటకలోని కలబుర్గి పట్టణంలోని ఓలా షోరూమ్ లో మహ్మద్ నదీమ్ అనే యువకుడు స్కూటర్ కొనుగోలు చేశాడు. మూడు వారాలు తిరగకముందే స్కూటర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో నదీమ్ తన స్కూటర్ ను ఓలా షోరూమ్ కు తీసుకెళ్లాడు. అయితే, షోరూమ్ సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓలా షోరూమ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో, షోరూమ్ లోని 6 స్కూటర్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమైనట్టుగా తెలిసింది. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షల విలువైన ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేశాడు.
అయితే స్కూటర్ కొన్న రెండు రోజుల్లోనే సమస్యలు మొదలయ్యాయని నదీమ్ ఆరోపిస్తున్నాడు. స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం, బండి మాటి మాటికి ఆగిపోవడం మొదలైంది. కొన్నిసార్లు అది స్టార్ట్ కావడం లేదు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదని బాధితుడు తెలియజేశాడు.అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షోరూమ్ కు నిప్పు పెట్టడంతో రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లుగా తెలిసింది.