Disney Plus Hotstar : కేవ‌లం రూ.49కే డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్లాన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Disney Plus Hotstar : ప్ర‌స్తుతం అనేక ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ లు మ‌నుగ‌డ‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం కొన్ని యాప్‌లు ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తుండ‌గా.. కొన్ని మాత్రం పెంచుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వార్షిక స‌భ్య‌త్వ రుసుమును ఇటీవ‌లే పెంచారు. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్ మాత్రం త‌న స‌భ్య‌త్వ రుసుమును త‌గ్గించింది. నెల‌వారీ, వార్షిక స‌భ్య‌త్వ రుసుముల‌ను నెట్ ఫ్లిక్స్ ఇటీవ‌లే త‌గ్గించింది.

Disney Plus Hotstar rs 49 per month available for selected users

అయితే తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో వినియోగ‌దారుల‌కు సీక్రెట్‌గా ఓ ఆఫ‌ర్ ల‌భిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొంద‌రు యూజ‌ర్లు ఈమేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టుల‌ను పెడుతున్నారు. కొంద‌రికి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ నెల‌వారీ మెంబ‌ర్‌షిప్ కేవ‌లం రూ.49 కే ల‌భిస్తున్న‌ద‌ట‌. ఈ మేర‌కు ప‌లువురు యూజ‌ర్లు పోస్టులు పెడుతున్నారు.

అయితే రూ.49కే నెల‌వారీ మెంబ‌ర్‌షిప్ అని నిజానికి హాట్ స్టార్ ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ అన‌ధికారికంగా కొంద‌రు యూజ‌ర్ల‌కు ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందువ‌ల్ల మీరు ఇప్ప‌టి వ‌ర‌కు హాట్ స్టార్‌ను ఉప‌యోగించి ఉండ‌క‌పోతే ఒక‌సారి ట్రై చేయండి. నెల‌కు కేవ‌లం రూ.49 కే హాట్ స్టార్ ప్లాన్‌ను పొందే అవ‌కాశం ల‌భిస్తుందేమో ఒక సారి చెక్ చేసుకోండి.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు 3 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.499, రూ.899, రూ.1499 ప్లాన్లు ల‌భిస్తున్నాయి. రూ.499 ప్లాన్ తీసుకుంటే కేవ‌లం ఒక డివైస్‌లోనే స్ట్రీమింగ్ వీక్షించ‌వ‌చ్చు. అదే రూ.899 ప్లాన్ అయితే 2 డివైస్‌లు, రూ.1499 ప్లాన్ అయితే ఏక కాలంలో 4 డివైస్‌ల‌లో స్ట్రీమింగ్‌ను వీక్షించ‌వ‌చ్చు. ఈ ప్లాన్‌లో వీడియోలు 4కె క్వాలిటీలో ల‌భిస్తాయి.

Editor

Recent Posts