Head Bath : మనం వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తూ ఉంటాం. ప్రతిరోజూ తలస్నానం చేసే వారు కూడా ఉంటారు. ఇలా తలస్నానం చేయడం వల్ల మురికి, మలినాలు తొలగిపోయి జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే తలస్నానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని పండితులు చెబుతున్నారు. వారంలో కొన్ని రోజుల్లో మాత్రమే తలస్నానం చేయాలని ఇలా చేయడం వల్ల అదృష్టం కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
వారంతో సంబంధం లేకుండా లేదా ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల ధనవంతులు కూడా బిచ్చగాళ్ల లాగా తయారవుతారని వారు చెబుతున్నారు. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కావాలనుకునే వారు కేవలం బుధవారం లేదా శనివారం మాత్రమే తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. తలస్నానం చేయడం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం కాదని షాంపూ లేదా కుంకుడు కాయలతో తలంటుకుని శుభ్రంగా స్నానం చేయాలని అప్పుడే ఐశ్వర్యం, ధనం కలిసి వస్తాయని వారు చెబుతున్నారు.
చాలా మంది సోమవారం, శుక్రవారం పూజ చేయాలని తలస్నానం చేస్తూ ఉంటారు. ఇలా సోమవారం, శుక్రవారం తలస్నానం చేయడం వల్ల ఈ వారమంతా ఏదో ఒక చెడు జరుగుతుందని వారు చెబుతున్నారు. అయితే స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు మాత్రం వారంతో సంబంధం లేకుండా తలస్నానం చేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఇళ్లు సుఖ శాంతులతో, ఐశ్వర్యంతో వర్థిల్లాలి అనుకునే వారు మాత్రం బుధవారం లేదా శనివారం మాత్రమే షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలని అప్పుడే అదృష్టం కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.