ఆధ్యాత్మికం

Brahma Muhurtam : బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేశారంటే.. మీ కోరికలు 100 శాతం ఫలిస్తాయి.. పట్టిందల్లా బంగారమే..!

Brahma Muhurtam : పెద్దలు మనకి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూ ఉంటారు. కానీ చాలామంది పెద్దలు మాటలు ని కొట్టిపారేస్తారే తప్ప ఫాలో అవ్వరు. నిజానికి బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా చేస్తే 100% మీ కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మ ముహూర్తం అంటే రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయం. అంటే వేకువ జామున మూడు గంటల నుండి ఐదున్నర మధ్య ఇది ఉంటుంది. ఈ సమయంలో కనుక నిద్ర లేచారంటే అందం తెలివితేటలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.

శరీరం కూడా ఎంతో అందంగా మారుతుంది దేవతలు భూలోకానికి దిగివచ్చే సమయమే ఈ బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో దేవాలయాలు తలుపులు తెరుచుకుంటాయి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలకి నమస్కరిస్తారు. సూర్యోదయం అవ్వకుండా నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించాలి. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేస్తే శరీరంలో సంజీవిని శక్తి ప్రసరిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన తర్వాత ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి.

do like this in brahma muhurtham to fulfill wishes

ఆ తర్వాత 21 నిమిషాల పాటు ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. తెల్లవారుజామున ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. అనారోగ్య సమస్యలు వంటివి కలగవు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. తులసి మొక్కకి రోజూ నీళ్లు పోసి ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అని ఈ విష్ణు మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది. ఆనందం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంటి ముఖద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు. బాధలన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాలు పోతాయి. విద్యార్థుల బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో శివుడిని కొలిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

Admin

Recent Posts