వినోదం

ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు.. హింట్ ఇచ్చిన పెద్ద‌మ్మ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నారు ప్ర‌భాస్.ఆయ‌న తోటి హీరోలంద‌రు పెళ్లిళ్లు చేసుకుంటుండ‌గా, ప్ర‌భాస్ మాత్రం ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉన్నాడు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే మిడిల్ ఏజ్ కి వచ్చేశారు. నాలుగుపదుల వయసు దాటారు. తన కెరీర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా రెబల్ స్టార్ అనే పిలిచే స్టేజ్ కు వచ్చారు. కేరిర్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ప్రభాస్.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇప్పటికే తన ఏజ్ గ్రూప్ నటులు పెళ్లిళ్లు చేసుకుని,పిల్లలను పట్టుకుని తిరుగుతారు. కానీ, ప్రభాస్ మాత్రం ఏక్ నిరంజన్ లాగా ఉండిపోయాడు.

అయితే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నాడట.? త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాసే తన పెళ్లి గురించి ఓ మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. దసరా పండగ రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్స్‌ ప్రకటిస్తారని అంటున్నారు. తన పుట్టిన రోజు అక్టోబర్ 23న ఎంగేజ్ మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నాడట.ఇటీవ‌ల ప్రభాస్ పెద్ద‌మ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. తాజాగా శ్యామలాదేవి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిరోజు త్వరలోనే రానుందని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పై అమ్మవారి ఆశీస్సులతో పాటు పెదనాన్న కృష్ణంరాజు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.

prabhas is reportedly getting married

2025లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి పరోక్షంగా కామెంట్లు చేయడం గమనార్హం. శ్యామలాదేవి క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సినీ కెరీర్ పరంగా టాప్ లో ఉన్న ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డార్లింగ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినీ పరిశ్రమకు చెందినవారు కాదని తెలుస్తోంది. తన సొంత ఊరు మొగల్తూరుకు చెందిన అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఆ అమ్మాయి ప్రభాస్‌కు దగ్గరి బంధువు అంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలు స్టార్ట్ కావాల్సి ఉండగా.. డార్లింగ్‌ బిజీ షెడ్యూల్‌తో వాయిదా పడుతూ వచ్చినట్లు చెబుతున్నారు.

Sam

Recent Posts