ఆధ్యాత్మికం

Lakshmi Devi : ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట కొలువై ఉంటుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఎలాంటి వాటికి కూడా లోటు ఉండదు. అన్నిటికీ డబ్బు అనేది చాలా అవసరం. సంపద ఉండాలంటే, లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తులు ఇంట్లో, ఐశ్వర్యం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం, లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇలా చేయడం మంచిది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే, ఇలా చేయాలి. రోజు ఉదయం పూజ చేస్తే, ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు.

గరుడ పురాణంలో ప్రతి వ్యక్తి పితృదేవతల్ని పూజించాలని చెప్పబడింది. క్రమం తప్పకుండా, పితృదేవతల్ని పూజిస్తే, వారి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం మొదలైన కార్యక్రమాలని పూర్తిచేసుకుని తర్వాత పితృదేవతలు దేవుళ్ళని పూజిస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందట. అలానే, స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలని గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం, వంటగది హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది.

do like this in the evening lakshmi devi will stay

స్నానం చేసిన తర్వాత, వంట చేస్తే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో దేవుళ్ళని పూజించే సమయంలో, మంత్ర పఠనం, గ్రంథ పఠనం చేయాలి. మత గ్రంథాలను చదివితే చాలా మంచి జరుగుతుంది. అటువంటి ఇంట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనం బాగా పెరగాలన్నా ఆవులకి, కుక్కలకి ఆహారాన్ని అందిస్తే మంచిది.

ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దని ఆవుకి, చివరి ముద్దని కుక్కకి పెట్టాలని గరుడ పురాణంలో ఉంది. కొంతమంది, రోజు రొట్టెలని మాత్రమే తింటుంటారు. అటువంటి వాళ్ళు మొదటి రొట్టెని ఆవుకి, చివర రొట్టెని కుక్కకి పెట్టాలి. ఇలా చేయడం వలన, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

Admin

Recent Posts