ఆధ్యాత్మికం

Gruha Pravesham : కొత్త ఇంట్లో గృహ ప్ర‌వేశం చేస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

Gruha Pravesham : సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని చాలా మందికి క‌ల ఉంటుంది. అందుకోస‌మే చాలా మంది క‌ష్ట‌ప‌డుతుంటారు. సొంతంగా ఇల్లు కాక‌పోయినా అపార్ట్‌మెంట్ అయినా తీసుకోవాల‌ని చూస్తుంటారు. అయితే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కట్టింది కొన్నా.. లేదా సొంతంగా క‌ట్టించుకున్నా.. వాస్తుకు ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంట్లో అన్నీ దోషాలే ఏర్ప‌డుతాయి. దీంతో అలాంటి ఇంట్లో నివ‌సించే వారు అన్నీ స‌మ‌స్య‌ల‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే దీంతోపాటు కొత్త ఇంటికి గృహ ప్ర‌వేశం చేసే స‌మ‌యంలోనూ కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఇంటిని కొత్త‌గా నిర్మిస్తున్న‌ట్లే లేదా క‌ట్టిన ఇంటిని తీసుకుంటే ఇంటి ప్ర‌ధాన ద్వారం ఈశాన్య దిశ‌లో ఉండేలా చూసుకోండి. అలా వీలు కుద‌ర‌క‌పోతే ఇంటి ప్ర‌ధాన ద్వారం తూర్పు వైపు ఉండేలా చూడండి. దీంతో వాస్తు దోషాలు చాలా వ‌ర‌కు త‌గ్గిపోతాయి. ఇక గృహ ప్ర‌వేశం చేసే వారు త‌గిన తేదీ, ముహుర్తాన్ని ఎంచుకోవ‌డం ముఖ్యం. కుటుంబ య‌జ‌మాని జాత‌కంతో ముహుర్తం చూడాల్సి ఉంటుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం శుక్ల ప‌క్షంలోని గురువారం లేదా శుక్ర‌వారం, ఆదివారం గృహ ప్ర‌వేశం చేయ‌డం చాలా మంచిద‌ని చెబుతుంటారు. అయితే క‌చ్చితమైన స‌మ‌యం లేదా ముహుర్తం కోసం పండితుల‌ను సంప్ర‌దిస్తే మంచిది.

if you are doing gruha pravesham then follow these rules

కొత్త ఇంట్లోకి ప్ర‌వేశించిన త‌రువాత పాలు పొంగిస్తారు. దీంతో ఆ ఇంట్లో సిరి సంప‌ద‌లు, ధ‌న‌ధాన్యాలు తుల‌తూగాల‌ని కోరుకుంటారు. అలాగే క‌చ్చితంగా స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాన్ని కూడా ఆచ‌రించాలి. దీని వ‌ల్ల ఇంట్లోని ప్ర‌తికూల శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గుతుంది. ఇంట్లో ఉండ‌బోయే వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌ల ప్ర‌భావం నుంచి తప్పించుకోవ‌చ్చు. అలాగే ఇంటిని కొనే ముందు లేదా క‌ట్టించేట‌ప్పుడు వాస్తు నిపుణుల‌ను సంప్ర‌దించి వాస్తు స‌ల‌హాల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం.

ఇక ఇంటి లోప‌ల‌, బ‌య‌ట ప‌రిస‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ ఆ ఇంటి మ‌హిళ‌లు ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఉండే వారిని అనుగ్ర‌హిస్తుంది. దీంతోపాటు వాస్తు దోషాలు కూడా పోతాయి. సుఖ సంతోషాల‌తో జీవిస్తారు. క‌నుక కొత్త ఇంట్లో చేర‌బోయే వారు ఈ నియ‌మాల‌ను త‌ప్పనిస‌రిగా పాటించాలి. లేదంటే స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Admin

Recent Posts