vastu

Patika : ప‌టిక‌తో ఇలా చేయండి.. అప్పుల బాధ‌లు పోతాయి.. డ‌బ్బు సంపాదిస్తారు..!

Patika : ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధల నుండి కూడా బయటపడొచ్చు. ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే పటిక వలన అనేక లాభాలు ఉన్నాయి. పటికతో చాలా సమస్యల్ని తొలగించుకోవచ్చు. పటికని ఇంట్లో పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది.

కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆనందం, శాంతి కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా పటికని ఇంట్లో పెట్టడం వలన నయమవుతాయి. పటిక నెగటివ్ ఎనర్జీని తొలగించేసి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తుంది. అందుకే చాలామంది వ్యాపారులు వ్యాపారంలో ఎలాంటి సమస్యలు కలగకూడదని షాపుల్లో పటికని పెడుతూ ఉంటారు. ఎర్రటి వ‌స్త్రంతోపాటు పటికని మీరు షాపుల్లో గమనించి ఉంటారు.

do like this with alum to remove economical problems

విద్యార్థులకు సంబంధించిన సమస్యలుంటే ఎర్రటి వ‌స్త్రంలో కొంచెం పటికని చుట్టి ఆ వస్త్రాన్ని వాళ్లతో పెట్టుకుంటే సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు కూడా అందుకే షాపుల్లో పెడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. టెన్షన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఒక గిన్నెలో పటిక వేసి ఇంట్లో ఏదైనా మూల పెట్టాలి. ఇలా చేస్తే కచ్చితంగా గొడవలు తగ్గుతాయి. మంచి వాతావరణం ఇంట్లో ఉంటుంది.

ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పడుకునే మంచం కింద కుండలో నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం పటిక వేస్తే ఇంట్లో శాంతి కలుగుతుంది. కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆదాయం తగ్గి అప్పుల భారం పెరిగినట్లయితే పటికని నీటిలో కలిపి ఇంటిని శుభ్రం చేయాలి.

ఇలా చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బాగా తొలగిపోతుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో పురోగతి లేకుండా ప్రయత్నాలు విఫలమవుతున్నట్లయితే నల్ల వ‌స్త్రంలో పటిక కట్టి ఇంటి ముఖద్వారం దగ్గర వేలాడదీయాలి. ఇలా చేస్తే చాలా చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. సంతోషంగా జీవించొచ్చు.

Admin

Recent Posts