మనిషి పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయం ఆధారంగా వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది జాతకం ద్వారా తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే రాశిఫలాలలతోపాటు చంద్రరాశి అనేది మరొకటి ఉంటుంది. ఈ చంద్ర రాశి ఆధారంగా మనిషి పుట్టినప్పుడు వారి స్థానం ఎలా ఉంది అనే విషయంపై ఆధారపడి వారు ఏ రంగు రాళ్లను ధరించాలి అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఏ రాశి వారు ఏ రంగు రాయి ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.
* మేష రాశి వారు ఎరుపు రంగు పగడపు రత్నం తొడగాలి.
* వృషభ రాశి వారు వజ్రపు ఉంగరాన్ని ధరించాలి.
* మిథున రాశి వారు పచ్చ రాయిని తొడగాలి.
* కర్కాటక రాశి వారు ముత్యం ధరించాలి.
* సింహ రాశి వారు కెంపు రాయిని తొడగాలి.
* కన్య రాశి వారు పచ్చ రాయిని తొడగాలి.
* తులారాశి వారు వజ్రం ధరించాలి.
* వృశ్చిక రాశి వారు పగడపు రాయి ధరించాలి.
* ధనుస్సు రాశి వారు పసుపు రంగు నీలమణి రాయిని ధరించాలి.
* మకర రాశి వారు నీలం రంగు రాయిని ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
* కుంభ రాశి వారు నీలి రంగు రాయిని ధరించాలి.
* మీన రాశి వారు పసుపు రంగు నీలమణి రాయిని ధరించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ రత్నాలను భిన్న రకాల లోహాలకు చెందిన ఉంగరాల్లో ధరించాల్సి ఉంటుంది. అంటే.. మేష రాశి వారు ఇనుముతో తయారు చేసిన ఉంగరంలో పగడం అమర్చి ధరించాల్సి ఉంటుంది. ఇలా భిన్న రాశులకు భిన్న లోహాలు ఉంటాయి.
వృషభ రాశి వారు రాగి, మిథునరాశి వారు ప్లాటినం లేదా అల్యూమినియం, కర్కాటక రాశి వారు వెండి, సింహ రాశి వారు బంగారం, కన్యా రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం, తుల రాశి వారు రాగి, వృశ్చిక రాశి వారు ఇనుము, ధనుస్సు రాశి వారు బంగారం, మకర రాశి వారు వెండి, కుంభ రాశి వారు అల్యూమినియం లేదా ప్లాటినం, మీనరాశి వారు వెండి లోహాలకు చెందిన ఉంగరాల్లో ఆయా రత్నాలను ధరించాల్సి ఉంటుంది.
ఇక ఆయా రత్నాలు కలిగిన రాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ బొటన వేలికి ధరించరాదు. పసుపు రంగు నీలమణిని చూపుడు వేలికి ధరించవచ్చు. మధ్య వేలికి వజ్రం, నీలమణి ఉంగరాలను ధరించవచ్చు. ఉంగరం వేలికి పగడం, కెంపు, ముత్యం ఉంగరాలను ధరించవచ్చు. చిటికెన వేలికి ముత్యం, పచ్చ ఉంగరాలను ధరించవచ్చు.
సోమవారం ముత్యపు ఉంగరాన్ని ధరించాలి. మంగళవారం పగడపు ఉంగరాన్ని, బుధవారం పచ్చ ఉంగరాన్ని, గురువారం పసుపు రంగు నీలమణి ఉంగరాన్ని, శుక్రవారం వజ్రపు ఉంగరాన్ని, శనివారం నీలమణి ఉంగరాన్ని, ఆదివారం కెంపు ఉంగరాన్ని ధరించాలి. ఈ విధంగా ఆయా రాశుల వారు ఆయా ఉంగరాలను ఆయా రోజుల్లో ధరించాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే ఎవరైనా జ్యోతిష్య శాస్త్ర నిపుణున్ని సంప్రదించవచ్చు.