Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. సంతోషంగా ఉండాలని ఇంట్లో సంపద ఉండాలని కోరుకుంటారు. అయితే, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం. ఇలా చేయడం వలన, సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది. మన పెద్దలు ఎన్నో నియమ నిబంధనలు పెట్టారు. వాటిని పాటిస్తే, చాలా మంచి జరుగుతుందని చెప్పేవారు.
కానీ, రోజు రోజుకి అవి పాటించే వాళ్ళు తక్కువ మంది అయిపోతున్నారు. అయితే, లక్ష్మీదేవి సంతోషపడే విధంగా మనం చేసినట్లయితే, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంపద, శ్రేయస్సు కావాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. మనం చేసే, చిన్న చిన్న పొరపాట్లు మనకి ఉన్న చిన్న అలవాట్లు ఆర్థిక ఇబ్బందుల్ని తీసుకువస్తాయి. అదృష్టాన్ని తొలగిస్తాయి. వాస్తు ప్రకారం, తప్పులు చేయకుండా చూసుకోవాలి. చిన్నచిన్న అలవాట్లే లక్ష్మీదేవికి కోపం కలిగిస్తాయి. దురదృష్టాన్ని కలిగిస్తాయి.
సాయంత్రం తులసిని ముట్టుకోకూడదు. హిందూ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక తులసిని ముట్టుకోవడం, పూజించడం చేస్తే దురదృష్టం కలుగుతుంది. తులసికి నీళ్లు పోయడం కూడా మంచిది కాదు. సూర్యాస్తమయం అయ్యాక తులసి దగ్గర దీపం వెలిగించొచ్చు. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి. పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది.
కానీ, ఇల్లు తుడవకూడదు. సూర్యాస్తమయం అయ్యాక, ఇల్లు తుడవడం వలన దురదృష్టం కలుగుతుంది. సంతోషం పోతుంది. సాయంత్రం పూట అసలు నిద్రపోకూడదు. సాయంత్రం పూట నిద్రపోవడం వలన దురదృష్టం కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఆహారం తిన్న తర్వాత, పాత్రలు వెంటనే శుభ్రం చేయకపోతే కూడా అదృష్టం తొలగిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. సూర్యాస్తమయం సమయంలో చదువుకోకూడదు. సూర్యాస్తమయం టైం లో ఆటలు ఆడుకుంటే, చాలా మంచిది. కాబట్టి, ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు.