వినోదం

Vijaya Shanthi : నందమూరి కుటుంబానికి, విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Vijaya Shanthi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. హీరోలతో సమానంగా పోటీ పడుతూ నటించడంతో విజయశాంతి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు, నందమూరి కుటుంబానికి మధ్య సంబంధం ఉంది.

శ్రీనివాస్ ప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు గణేష్ రావుకు స్వయానా మేనల్లుడు కావడం విశేషం. ఇలా నందమూరి కుటుంబానికి బంధువైన శ్రీనివాస్ ప్రసాద్ నిర్మాతగా నందమూరి బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్ స్థాపించారు. వీరి నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా నిప్పురవ్వ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన విజయశాంతికి శ్రీనివాస్ ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది.

relationship between vijayashanthi husband and nandamuri family

ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే వీరి నిర్మాణంలో తెరకెక్కిన నిప్పురవ్వ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. ఇలా శ్రీనివాస్ ప్రసాద్ ను వివాహం చేసుకున్న తర్వాత బాలకృష్ణతో విజయశాంతి నటించిన చివరి సినిమాగా నిప్పురవ్వ నిలిచిపోయింది.

Admin

Recent Posts