ఆధ్యాత్మికం

Lord Ganesha : వినాయ‌కుడి పూజ‌లో వీటిని త‌ప్ప‌క పెట్టాలి..!

Lord Ganesha : ప్రతి ఒక్క‌రు కూడా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుతారు. పెద్ద పెద్ద మండపాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే వినాయకుడి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. వినాయక చవితి పూజలో ఇవి తప్పనిసరి అని గుర్తు పెట్టుకోండి. మామూలుగా పూజ చేసే స‌మ‌యాల్లోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కూడదు.

వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. వినాయకుడికి క‌చ్చితంగా గరికను పెట్టి పూజించండి. అంతా శుభ‌మే జరుగుతుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ఇష్టం. నైవేద్యంగా ఈ రెండిటిని కచ్చితంగా పెట్టండి. ఈ రెండు పెట్టి మీరు ఇంకేమైనా నైవేద్యాలని పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. కానీ ఈ రెండు అంటే మాత్రం వినాయకుడికి ఎంతో ప్రీతి.

do not forget to put these in ganesh pooja

గణేషుడి పూజలో ఎర్రని పూలను ఉపయోగించండి. ఎర్రని మందారాలు వంటివి వాడొచ్చు. ఎర్రటి గులాబీ పూలను కూడా పెట్టొచ్చు. వినాయకుడి అలంకరణలో సింధూరం కూడా ఒకటి. వినాయకుడిని పూజించేటప్పుడు సింధూర తిలకాన్ని దిద్దండి. వడపప్పు, పానకం, చలిమిడి తప్పక పెట్టండి. పూజ సమయంలో నైవేద్యంగా వీటిని వినాయకుడికి సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం ఉంటుంది. కేవ‌లం వినాయ‌క చ‌వితి స‌మ‌యంలోనే కాకుండా ఎప్పుడైనా గ‌ణేషుడికి పూజ చేస్తే ఈ నియ‌మాల‌ను పాటించండి. దీంతో స్వామి వారి ఆశీస్సులు ల‌భిస్తాయి. అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా నెర‌వేరుతుంది.

Admin

Recent Posts