ఆధ్యాత్మికం

Bath : స్నానం విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Bath : స్నానం చేశాక ఈ తప్పులను అసలు చేయకూడదు. ఈ తప్పులని చాలా మంది స్నానం చేశాక చేస్తారు. కానీ ఇలా చేస్తే దరిద్రం వస్తుంది. కాబట్టి అస్సలు ఈ తప్పులు చేయకండి. ఈ తప్పులను చేస్తే అనవసరంగా మీరే బాధపడాలి. మరి ఇక ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఎటువంటి విషయాలని గుర్తుపెట్టుకుని పాటించాలి అనేది చూసేద్దాం. స్నానం చేసాక చాలామంది బకెట్లో వాటర్ ని అలానే వదిలేస్తూ ఉంటారు. కానీ అలా విడిచి పెట్టడం మంచిది కాదు. మిగిలిన నీటిని ఎవరైనా ఉపయోగిస్తే, ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం పడుతుంది.

వాస్తు ప్రకారం శుభ్రమైన నీటితోనే బకెట్ ని నింపాలి. బకెట్లో నీళ్లు లేకపోతే బకెట్ ని బోర్లించేయాలి. ఈ తప్పుని ఎప్పుడూ చేయకండి. చాలా మంది ఈ పొరపాటు చేస్తుంటారు. పెళ్లి అయిన స్త్రీలు జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ పెట్టకూడదు. జుట్టు ఆరాక మాత్రమే కుంకుమని పెట్టుకోవాలి. స్నానం చేసి జుట్టుని అలాగే వదిలేస్తే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి వెంటనే తుడుచుకోవాలని గుర్తుపెట్టుకోండి.

do not make these mistakes while bathing

స్నానం చేయడానికి ముందు నెయిల్ కట్టర్ ని ఉపయోగించకూడదు. స్నానం చేశాక పదునైన వస్తువులను ముట్టుకోకూడదు. స్నానం చేసిన వెంటనే స్టవ్ దగ్గరికి, మంట దగ్గరికి వెళ్లడం మంచిది కాదు. స్నానం చేశాక ఏదైనా తిని ఆ తర్వాత మాత్రమే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి.

తడి బట్టలను ఉతకకుండా ఉంచకూడదు. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ ని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఈ పొరపాట్లను కనుక చేశారంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. డబ్బు కొరత కూడా ఏర్పడుతుంది. రాహు, కేతు, శని గ్రహాలు చికాకు పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేశాక ఈ పొరపాట్ల‌ను చేయకండి.

Admin

Recent Posts