vastu

మీకు చెందిన ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇత‌రుల‌కు ఇవ్వ‌కండి..!

మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల‌ వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ కలగకుండా ఉండాలంటే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. ఇటువంటి తప్పులు చేయడం వలన కచ్చితంగా నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ కూడా ఒకరికి వాచ్‌ని ఇవ్వకూడదు. వాచీలు ఇవ్వడం వలన నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఎవరికైనా మీరు వాచీని బహుమతిగా ఇస్తే మీ కష్టమంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే మీ అదృష్టం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా వాచీల‌ని ఇతరులకి ఇవ్వకూడదని అంటూ ఉంటారు.

ఒకరు ఉపయోగించిన బట్టల్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇలా ఒకరి బట్టల్ని ఇంకొకరికి ఇవ్వడం వలన దురదృష్టం మీకు కలుగుతుంది. మంచి జరగదు. కనుక వాడిన బట్టలను ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా ఇతరులకి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఇష్టపడే వ్యక్తికి పర్ఫ్యూమ్స్ ని ఇవ్వకండి. నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. మీ రిలేషన్ షిప్ లో సమస్యలు కూడా వస్తాయి.

do not give these items of yours to others

మనీ ప్లాంట్ ని కూడా ఎప్పుడూ ఎవరికీ మనం బహుమతిగా ఇవ్వకూడదు. మనీ ప్లాంట్ ని ఇవ్వడం వలన మన అదృష్టం తొలగిపోయి మనకి నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మనీ ప్లాంట్ ని ఇతరులకు ఇవ్వడం వలన దురదృష్టం కలుగుతుంది. డబ్బులను కూడా కోల్పోతూ ఉంటారు.

చీపురుని కూడా ఎప్పుడు ఎవరికీ ఇవ్వకూడదు. చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురుని ఇతరులకు ఇవ్వడం వలన అదృష్టం పోతుంది. డబ్బులను కోల్పోతారు. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ వీటిని ఇవ్వకండి. వీటిని ఇవ్వడం వలన మీకే చెడు జరుగుతుంది. అనవసరంగా అనేక సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ తప్పుల‌ను అస్సలు చేయకండి.

Admin

Recent Posts