vastu

House Main Door : మీ ఇంటి మెయిన్ డోర్ వ‌ద్ద ఇలా చేయండి.. మీపై ఉండే దిష్టి మొత్తం పోతుంది..!

House Main Door : ప్రతి ఒక్కరు కూడా, అంతా బాగుండాలని, వారికి మంచి జరగాలని అనుకుంటుంటారు. కానీ, కొన్ని కొన్ని సార్లు ఏమైందో తెలియదు. కానీ, మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము. సాధారణంగా, మనం జీవితంలో ఎదిగే కొద్ది అసూయ పడే వ్యక్తులు కూడా పెరిగిపోతూ ఉంటారు. వారి అసూయ కూడా పెరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు, పొరుగువారు, బంధువులు ఇలా చాలామంది అసూయ పడుతూ ఉంటారు. నిజానికి, ఇలాంటి వారికి దూరంగా ఉండడం కష్టం.

అలాంటి వాళ్ళు, ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళతో పాటుగా ప్రతికూల శక్తిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అసూయ పడే వ్యక్తుల వలన, ఇంటికి దిష్టి తగులుతుంది. దాని వలన గొడవలు వంటివి జరుగుతుంటాయి. మానసిక ప్రశాంతను కోల్పోతూ ఉంటారు. ఇటువంటి సమస్యల నుండి పరిష్కారాన్ని పొందాలంటే, మంచైనా చెడైనా ఇంటి ప్రధాన ద్వారం గుండానే వస్తుంది. అందుకే, ఇంటి ప్రవేశద్వారం ముఖ్యమైనది.

keep these at your house main door to remove dishti

మీ ఇంటి ముఖద్వారానికి గుర్రపు నాడా పెట్టుకోవాలి. ఎవరైనా వ్యక్తులు తమతో పాటు, ప్రతికూల శక్తిని తీసుకొస్తున్నట్లయితే ఇది అడ్డుకుంటుంది. పౌర్ణమి రోజు, ఇంటి ప్రవేశ ద్వారం వద్ద, ఇంటి లోపల అలానే నాలుగు మూలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని చల్లాలి. ఇలా చేస్తే దిష్టి తగలకుండా ఉంటుంది. స్పటిక కూడా పెట్టవచ్చు. స్పటికని ఎడమ చేతికి బ్రాస్లెట్ గా పెట్టుకోవాలి.

శరీరం యొక్క ఎడమవైపు గ్రహణ శక్తి ఉంటుంది. స్పటికను ఎడమ మణికట్టుకు ధరిస్తే, ప్రతికూల శక్తిని అది గ్రహిస్తుంది. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే, ఉప్పు కూడా ఉపయోగపడుతుంది. ఉప్పు ని గాలి వెళ్లని ఒక సంచిలో నింపేసి, దానిని ప్రవేశ ద్వారం వద్ద డోర్ మేట్ కింద పెట్టండి. ఇలా, ఇక్కడ చెప్పినట్లు మీరు పాటించినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది.

Admin

Recent Posts