ఆధ్యాత్మికం

Meals : ఇటువంటి వాళ్ళ ఇంట అస్సలు భోజనం చేయకూడదు.. పాపం చుట్టుకుంటుంది..!

Meals : అప్పుడప్పుడు మనం ఎవరినైనా ఇంటికి పిలిచి, భోజనం పెడుతూ ఉంటాము. అలానే, ఎవరైనా మనల్ని భోజనానికి పిలిచినట్లయితే, మనం వాళ్ళ ఇంటికి వెళ్లి, భోజనం చేస్తూ ఉంటాం. చుట్టాలు కానీ స్నేహితులు కానీ లేదంటే, తెలిసిన వాళ్ళు కానీ భోజనం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. మనం కూడా అటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అయితే, భోజనం చేసేటప్పుడు, ఇటువంటి వాళ్ళ ఇంట్లో మాత్రం అసలు భోజనం చేయకూడదు. ఇలాంటి వారి ఇంట్లో భోజనం చేస్తే, పాపాలు చుట్టుకుంటాయి. మరి ఎటువంటి వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడూ కూడా దొంగలు, నేరాలకి పాల్పడిన వారి ఇంట, భోజనం చేయకూడదు అని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి, దొంగలు, నేరాలుకి పాల్పడిన వారి ఇంట, భోజనం చేయకండి. పాపాలు చేసిన వాళ్ళ పాప ప్రభావం, వాళ్ళు వడ్డించే ఆహారం మీద కూడా పడుతుంది. అటువంటి ఆహారాన్ని మనం తింటే, మనకి పాపం చుట్టుకుంటుంది. పాప సొమ్ముతో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం మంచిది కాదు.

do not take meals at this peoples home

అది పాప భోజనం అని గరుడ పురాణం చెప్తోంది. కనుక, ఈ తప్పుని అస్సలు చెయ్యొద్దు. అలానే, మాదకద్రవ్యాలకి, మద్యానికి, ధూమపానానికి, కామానికి బానిసలు అయిన వాళ్ళ ఇంట కూడా, భోజనం చేయకూడదు. ఇటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తి ఇలాంటి వారి ఇంట్లో ఉంటుంది.

వాళ్లు వడ్డించే భోజనం ద్వారా, వచ్చే ప్రతికూలత వలన, వారి చెడు మనకి కూడా వస్తుంది అని గరుడ పురాణం చెప్పడం జరిగింది. నపుంసకులకు వీలైనంత వరకు దానం చేయడం మంచిది. ఎప్పుడూ కూడా ఇటువంటి వారి ఇంట కూడా భోజనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం అనుభవించకూడదని గరుడ పురాణం చెప్తోంది.

Admin

Recent Posts