lifestyle

Chanakya : పొర‌పాటున కూడా ఈ విష‌యాల‌ను ఎవ‌రితోనూ చెప్ప‌కండి.. మీకే హాని క‌లుగుతుంది..!

Chanakya : చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి ద్వారా ప్రసిద్ధి చెందింది. చతుర్విధ పురుషర్దాలలో రెండవదైన అర్థ పురుషార్థము గురించి అర్థశాస్త్రాన్ని చాణక్యుడు రచించారు. చాణక్యుడు స్వయంగా అధ్యాపకుడు అవ్వడం వలన, విద్య యొక్క విలువ ఆయనకి బాగా తెలుసు. ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల గురించి చెప్పారు. ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది చాణక్య చక్కగా వివరించారు.

చాణక్య చెప్పిన విధంగా మనం ఆచరిస్తే, జీవితంలో ఎంత పెద్ద సమస్యని అయినా సరే మనం సులభంగా పరిష్కరించవచ్చు. కొన్ని విషయాలని ఎవరితో కూడా పంచుకోకూడదని చాణక్య చెప్పారు. ఇటువంటి విషయాలను ఇతరులకి చెప్పడం వలన మనకే హాని కలుగుతుందని చాణక్య అన్నారు. పొరపాటున కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది, మీ శత్రువుల కి కానీ, మీ పోటీ దారులకి కానీ చెప్పకూడద‌ని చాణక్య చెప్పారు.

do not tell these matters to any one

దాని వలన మీ విజయానికి అడ్డంకి కలుగుతుంది. మీ బలహీనతల గురించి కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. దీని వలన మీకే ప్రమాదం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కానీ, ఎలా దానిని సాధించాలో తెలియక కష్ట పడుతూ ఉంటారు. ఎప్పుడైనా కూడా మీరు విజయాన్ని అందుకోవాలంటే, చిన్నచిన్న భాగాలుగా పనిని విభజించుకుని, క్రమ పద్ధతిలో వాటి కోసం కష్ట పడితే మీకు అంతా కలిసే వస్తుంది.

మీరు అనుకున్నది సాధించొచ్చు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా స్వార్థంతో ఉన్న వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు సంబంధాలకి ఎక్కువ సమయాన్ని ఇవ్వరు. కాబట్టి, జీవితంలో మీరు మంచి పొజిషన్ లోకి రావాలంటే, వీటిని కచ్చితంగా ఆచరించి తీరాలి. అప్పుడు అనుకున్నది పూర్తి చేయవచ్చు.

Admin

Recent Posts