ఆధ్యాత్మికం

Lord Shiva : శివ‌పూజ‌లో వీటిని అస‌లు ఉప‌యోగించ‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

Lord Shiva : చాలా మంది శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి శివుడిని కొలుస్తూ ఉంటారు. పరమేశ్వరుడిని పూజిస్తే, చక్కటి ఫలితం ఉంటుందని జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని భావిస్తారు. ఎప్పుడైనా ఆలయంలో శివుడిని చూసినట్లయితే, శివుడికి కుంకుమ తిలకం ఉండదు. ఈశ్వరుడికి ఇలా చాలా విషయాల్లో తారతమ్యాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొన్ని వస్తువులతో శివుడిని పొరపాటున కూడా పూజించకూడదని అంటున్నారు. మరి వాటి గురించి చూద్దాం.

ఈసారి మీరు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. మీరు శివుడిని పూజించేటప్పుడు, తులసి ఆకులని అసలు ఉపయోగించకూడదు. అలానే, శంఖం, కొబ్బరినీళ్లు, ఎర్రని రంగులో ఉండే పువ్వులు పెట్టకూడదు. వీటిని శివుడికి సమర్పించడం మంచిది కాదు. వీటితో అస్సలు శివుడిని ఆరాధించకూడదు. శివుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తుల కోరికల్ని పరమేశ్వరుడు వెంటనే తీరుస్తాడు.

do not use these in lord shiva pooja

మహాశివరాత్రి, శ్రావణమాసం అంటే శివుడికి చాలా ప్రీతికరం. ఆ రోజుల్లో పూజలు చేస్తే, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని దేవుళ్ళని విగ్రహరూపంలో పూజిస్తూ ఉంటాం. కానీ, శివుడిని లింగ రూపంలో పూజిస్తాం. అన్ని దేవుళ్ళకి తిలకం పెట్టినట్లు శివుడికి పెట్టరు. శివుడిని పూజించేటప్పుడు, కుంకుమ, సింధూరం వంటివి పెట్టకూడదు. సింధూరం, కుంకుమ చాలా దేవుళ్ళకి ఎంతో ఇష్టం. అందుకని వాటిని పూజ సమయంలో వాడుతూ ఉంటాము.

కానీ, శివుడికి అలా కాదు. శివుడికి శంఖంతో నీళ్లు ఇవ్వకూడదు. తులసి ఆకులని శివుడికి పెట్టకూడదు. కొబ్బరి నీళ్ళని కూడా శివుడికి సమర్పించకూడదు. అలానే, ఎర్రటి పూలతో కూడా పూజ చేయకూడదు. శివుడికి పసుపుతో కూడా పూజ చేయకూడదు. పసుపుతో కూడా శివుడిని పూజించడం మంచిది కాదని పండితులు అంటున్నారు. కనుక, ఈ తప్పులను చేయకుండా చూసుకోండి.

Admin

Recent Posts