ఆధ్యాత్మికం

Lord Shiva : సోమవారం నాడు శివుడిని ఇలా పూజిస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి.. ఎంతో పుణ్యం కూడా..!

Lord Shiva : హిందువులందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు. సర్వమంగళ స్వరూపుడు శివుడు. శివుడు ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏమీ కూడా జరగదు. శివుడికి సోమవారం అంటే ఎంతో ఇష్టం. అందుకని ప్రత్యేకంగా సోమవారం నాడు, హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శివుడిని కనుక పూజించారంటే ఎన్నో సమస్యల నుండి గట్టెక్కొచ్చు. శివుడిని సోమవారం నాడు పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం. అందులో తిరుగులేదు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

దారిద్ర బాధలు, ఇతర సమస్యలు కూడా పోతాయి. ఏ విధంగా పరమశివుడిని ఆరాధించాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం.. సోమవారం ఉదయాన్నే లేచి, తలస్నానం చేయాలి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు పటానికి గంధం రాసి, దాని మీద బొట్టు పెట్టాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. శివలింగానికి మంచి నీటితో అభిషేకాన్ని చేయాలి. తర్వాత విభూది సమర్పించి, ఆ విభూతిని నుదుటిని పెట్టుకోవాలి.

do pooja to lord shiva like this on monday for many benefits

బిల్వపత్రం అంటే శివుడికి ఎంతో ఇష్టం. బిల్వాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. బిల్వపత్రాన్ని శివుడికి సమర్పిస్తే దారిద్రం తొలగిపోతుంది. తెల్ల గన్నేరు, ఎర్ర గన్నేరు, తుమ్మి పూలు, మోదుగ పూలు, తెల్ల జిల్లేడు పూలు శివుడికి ఎంతో ఇష్టం. వీటితో పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది. శివ అష్టోత్తరాలు చదువుతూ సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. శివాలయానికి వెళ్లి కానీ లేదంటే ఇంట్లో కాని ఆవు నెయ్యి తో దీపం వెలిగించాలి.

సాయంత్రము నైవేద్యం కింద తాలింపు వేసిన పెరుగు అన్నం పెట్టాలి. ఇలా ప్రతి సోమవారం చేస్తే అప్పులు బాధలు పోతాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. శివ స్తోత్రాలు చదవడం శివ పంచాక్షరిని నిరంతరం జపించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా శివుడి అనుగ్రహం పొంది కష్టాల నుండి గట్టెక్కచ్చు.

Admin

Recent Posts