వినోదం

Pawan Kalyan : అజ్ఞాతవాసి మూవీలో పవన్‌ మెడలో వేసుకున్న ఈ లాకెట్‌ గురించి తెలుసా..?

Pawan Kalyan : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన చిత్రం.. అజ్ఞాతవాసి. ఈ మూవీ పవన్‌ కెరీర్‌లో డిజాస్టర్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అప్పట్లో వీరి కాంబినేషన్‌ అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. దీంతో చిత్రంపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఘోరమైన డిజాస్టర్‌ టాక్‌ను మూటగట్టుకుంది.

ఇక ఈ మూవీలో పవన్‌ ఒక కోటీశ్వరుడికి కొడుకుగా నటించాడు. అయితే ఈ మూవీలో ఆయన ఒక లాకెట్‌ ధరించారు. గుర్తుంది కదా. మూవీలో ఒక లాకర్‌ను ఓపెన్‌ చేసేందుకు ఆ లాకెట్‌ ఉపయోగపడుతుంది. అయితే వాస్తవానికి ఆ లాకెట్‌పై ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. రామ్‌ చరణ్‌ నిర్వహిస్తున్న కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీకి చెందిన ఆంజనేయ స్వామి బొమ్మ ఆ లాకెట్‌ మీద ఉంటుంది. అప్పట్లో తమ మధ్య విభేదాలు లేవు అని చెప్పేందుకు పవన్‌ ఆ లాకెట్‌ను ధరించారు.

do you know about the locket of pawan kalyan in agnatha vasi movie

అజ్ఞాతవాసి ఫంక్షన్‌లోనూ పవన్‌ ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీలో అనేక విభేదాలు వచ్చినట్లు స్పష్టమవుతుంది. నాగబాబు, పవన్‌ జనసేనలో కీలకంగా ఉన్నారు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం కలివిడిగా ఉండడం లేదు. ఇది మెగా ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. అయితే తమ మధ్య విభేదాలు లేవని చెప్పినప్పటికీ ఎప్పటికప్పుడు వారి మధ్య ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Admin

Recent Posts