వినోదం

Actress : ఏయే హీరోయిన్స్ ఎక్క‌డ‌ టాటూస్ వేయించుకున్నారు.. ఆ టాటూల అర్ధం ఏమిటి తెలుసా..?

Actress : ఈ రోజుల్లో సెల‌బ్రిటీల‌తో పాటు సామాన్యులు సైతం టాటూలు తెగ వేయించుకుంటున్నారు. ఒక్కొక్క‌రు ఒక‌టి, రెండు కాదు ప‌దికి పైగానే వేయించుకుంటూ ఆనందం పొందుతున్నారు. తమకు ఇష్టమైన పేర్లతోపాటు హీరో పేర్లను, ఫొటోలను, కుటుంబసభ్యులు, దేవుళ్ల ఫొటోలను, చేతి బ్యాండ్‌ వంటి టాటూస్‌ను వేయించుకుంటున్నారు. ఇక సెల‌బ్రిటీల విషయానికి వ‌స్తే వారు తాము నమ్మిన ఫిలాస‌ఫీనో లేదంటే జ్ఞపకాల‌నో, జీవితంలో ఏదైన సంద‌ర్భానికి సంబంధించిన ప్ర‌తిబింబాల‌నో వేసుకుంటున్నారు.

do you know the meaning of these tattoos wore by actress

సమంత టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. సమంత బాడీపై మూడు చోట్ల వేయించుకున్న టాటూలు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా గుర్తుగా సామ్.. తన వీపుపై ymc అనే టాటూ అప్పట్లో వేయించుకుంది. ఇక సమంత నడుముకి పైభాగంలో చై అని టాటూ ఉంటుంది. అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. అయితే ఇలాంటి టాటూ నాగచైతన్య చేతికి కూడా ఉంటుంది.

ప్రభుదేవతో డీప్ ల‌వ్ లో ఉన్న‌ప్పుడు న‌య‌న‌తార‌ అత‌ని పేరులోని మొద‌టి అల్పాబెట్ అయిన P ని త‌న చేతిపై టాటూగా వేయించుకుంది. ఇక త్రిష త‌న ఎద భాగంలో డిస్నీ క్యారెక్టర్ నేమ్‌ని, చేతి వెనుకభాగంలో తన రాశి అయిన‌ వృషభాన్ని, ఎడమ భుజంపై సినిమా ప్రొఫెష‌న్ ను రిప్ర‌జెంట్ చేసేలా ట్రైపాడ్ విత్ కెమెరాను టాటూగా వేయించుకుంది. తాప్సీకి ఎడమ కాలు మీద డ్యాన్సింగ్ గర్ల్ టాటూ ఉంటుంది. ఇలియానా చేతి వెనుక భాగంలో, రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటుంది. ఇది తన సిస్టర్స్ ని సూచిస్తుందని ఒక‌ప్పుడు ఇలియానా స్వ‌యంగా చెప్పుకొచ్చింది.

ఇక క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ త‌న పేరును భుజంపై టాటూగా వేసుకుంది. ఇక మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌.. తన‌ చేతిపై భ‌ర్త‌ మహేశ్, పిల్ల‌లు సితార, గౌతమ్ ల‌ పేర్లను టాటూగా వేయించుకుంది.

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక త‌న చేతిపై Irreplaceable అనే టాటూ ఉంటుంది. ఇది తన వ్యక్తిత్వానికి సూచన అని చెబుతుంది. ఇక అనసూయ ఎద భాగంపై నిక్కు అనే టాటూ ఉంటుంది. ఈ నిక్కు అనేది అన‌సూయ భ‌ర్త సుశాంక్ భరద్వాజ్ నిక్ నేమ్ అట‌.

జూనియ‌ర్ స‌మంత‌గా ప్రాచుర్యం పొందిన అషూ రెడ్డి త‌న ప్రైవేట్ పార్ట్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును టాటూగా వేయించుకొని హాట్ టాపిక్ గా మారింది.

Admin

Recent Posts