వినోదం

Balakrishna : బాల‌య్య న‌టించిన ఆ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు.. కానీ సూప‌ర్ హిట్ అయింది.. ఆ మూవీ ఏమిటో తెలుసా..?

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు అంటే అందులో యాక్ష‌న్ సీన్స్ త‌ప్పక ఉండాల్సిందే. చేజింగ్ సీన్స్ లేదంటే క‌త్తి తిప్ప‌డం, జీపులు పైకి లేప‌డం వంటివి ఉంటాయ‌ని అభిమానులు ఆశిస్తుంటారు. సాధార‌ణంగా బాల‌య్య న‌టించిన ప్రతి సినిమాలో ఇవి కామ‌న్‌గానే ఉంటాయి. కానీ ఒక చిత్రంలో మాత్రం ఒక్క ఫైట్ కూడా ఉండదు. ఆ సినిమా సూప‌ర్ హిట్. ఆ చిత్రం మ‌రేదో కాదు నారినారి న‌డుమ మురారి. 1990 ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం బాల‌కృష్ణ 50వ సినిమా కాగా, ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందింది.

యువచిత్ర బ్యానర్‌పై, కె.నరసింహ నాయుడు నిర్మాతగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, శోభన, నిరోషా హీరోయిన్స్‌గా, కైకాల సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి, 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘ‌న విజ‌యం సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కనపెట్టి, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ హైలైట్‌గా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య నటన సినిమాకి హైలెట్ అయ్యింది. బాల‌య్య స‌ర‌స‌న శోభ‌న‌, నిరోషా జంట‌గా క‌నిపించారు.

balakrishna movie without a single action scene

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని వేలం చెర్రి అనే ప్రాంతంలో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఇందులో ఒక్క ఫైట్ సీన్, ఒక్క డ్యాన్స్ స్టెప్ లేకుండా మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు బాల‌కృష్ణ. అల్లు రామలింగయ్య, బాబూ మోహన్, అంజలీదేవి, రమాప్రభ తదితరులు నటించిన ఈ సినిమాకి తనికెళ్ళ భరణి ర‌చ‌న చేశారు. బాలకృష్ణ కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పినా.. తొడగొట్టినా.. థియేటర్ దద్దారిలాల్సిందే. అయితే ఇవేమి లేకున్నా బాక్సాఫీస్ మోత మోగిస్తాన‌ని నారీ నారీ న‌డుమ మురారి సినిమాతో నిరూపించాడు బాల‌కృష్ణ‌.

Admin

Recent Posts