Susmitha : సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీకే పెద్దన్నగా మారారు. 1955 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రీజ.. కుమారుడు రామ్ చరణ్. ఇక చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికీ తెలిసిందే.
సుస్మితకు చెన్నైలో స్థిరపడిన విష్ణుప్రసాద్ తో వివాహం జరిపించారు. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడింది. విష్ణు ప్రసాద్ తాత ఎల్‌వీ రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరు మోసిన వ్యాపారవేత్త. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు కొనసాగించేవారు. ఆయన కుమారుడు ఎల్‌వీ ప్రసాద్, చంద్రిక దంపతుల కొడుకే విష్ణు ప్రసాద్. ఇక విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశాడు. విదేశాలలో చదువు పూర్తి చేసుకుని తమ వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టాడు. తాత ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారథ్యంలో బాగా డెవలప్ కాగా.. విష్ణు ప్రసాద్ వచ్చాక ఆ బిజినెస్ మరింత వృద్ధిలోకి వచ్చింది.
ఇక విష్ణు ప్రసాద్, సుస్మిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుస్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సుస్మిత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంది. దీంతో ఆమె సినిమాలలో నటులకు కాస్ట్యూమ్‌లను డిజైన్ చేస్తోంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. సినీ రంగ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో సుస్మితను భర్త విష్ణు ప్రసాద్ ప్రోత్సహించాడు. దీంతో ఆమె సినిమాలకు పనిచేస్తోంది.