వినోదం

Kattappa: క‌ట్ట‌ప్ప లాంటి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

Kattappa: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో బాహుబ‌లి ఒక‌టి. ఇందులో ప్ర‌తి పాత్ర ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసే విధంగా ఉంటుంది. అస‌లు ‘బాహుబలి’ ని బాలీవుడ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలి అనుకున్నారు రాజమౌళి.అయితే అక్కడి సెలబ్రిటీలు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించక‌పోవ‌డంతో టాలీవుడ్ స్టార్లతోనే ఆ ప్రాజెక్టుని తెరకెక్కించి చ‌రిత్ర సృష్టించాడు రాజమౌళి. ఈ సినిమాతో ప్రభాస్ ఇండియా లోనే టాప్ హీరో గా ఎదిగాడు.రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ సినిమా లో బాహుబలి పాత్ర తర్వాత చాలా ముఖ్యమైన పాత్రల్లో కట్టప్ప పాత్ర ఒకటి అనే విష‌యం తెలిసిందే.

క‌ట్ట‌ప్పగా స‌త్య‌రాజ్ ఆ పాత్ర‌కి ప్రాణం పోశాడు. ఈ పాత్ర‌లో ఆయ‌న త‌ప్ప మరెవ‌రు న‌టించలేరు అనే విధంగా న‌టించి మెప్పించాడు. ఈ సినిమాతో స‌త్య‌రాజ్‌కి కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కాయి.బాహుబలి పక్కనే ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ మొదటి పార్ట్ కి ఎండింగ్ ఇవ్వ‌డంతో రెండో పార్ట్ లో కట్టప్పా క్యారెక్టర్ చాలా కీలకమైంది ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి మ‌లయాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్‌ని అప్రోచ్ అయ్యార‌ట‌.

do you know who missed to do kattappa character

ఈ పాత్ర త‌న‌క న‌చ్చ‌క మోహ‌న్ లాల్ సున్నితంగా రిజెక్ట్ చేశాడ‌ట‌. అయితే సినిమా రిలీజ్ కావ‌డం క‌ట్ట‌ప్ప పాత్ర‌కి మంచి పేరు రావ‌డంతో మోహ‌న్ లాల్ చాలా బాధ‌ప‌డ్డాడ‌ట‌. ఆ పాత్ర చేసి ఉంటే చాలా బాగుండేది క‌దా అని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పుకొని కాస్త బాధ‌ప‌డ్డాడ‌ట మోహ‌న్ లాల్. ఇక ఈ సినిమాలో శివగామి పాత్రలో నటించమని రాజమౌళి మొదట శ్రీదేవిని కోరారు. అయితే ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఈ ప్రాజక్ట్ కి దూరమయ్యారు. ఆ పాత్రను రమ్యకృష్ణ దక్కించుకొని అభినందనలను, అవకాశాలను పొందింది.

Admin

Recent Posts