lifestyle

బీర్ సీసాలు గ్రీన్ లేదా బ్రౌన్ క‌ల‌ర్‌లోనే ఎందుకు ఉంటాయి..?

మ‌న‌కు అనారోగ్యం క‌లిగితే సొంత వైద్యం పేరిట మందుల షాపులకు వెళ్లి మందుల‌ను కొనుగోలు చేసి వేసుకుంటాం. లేదంటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి వారు సూచించిన‌ట్టుగా మందుల‌ను కొని వేసుకుంటాం. అయితే మెడిసిన్ విష‌యానికి వ‌స్తే చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. కానీ కొన్ని సీసాలు, మందు బాటిల్స్‌తో మ‌న‌కు ఓ విష‌యం తెలుస్తుంది. అదేమిటంటే.. మీరెప్ప‌డైనా టానిక్ సీసాల‌ను లేదా కొన్ని ర‌కాల ట్యాబ్లెట్ల‌ను ఇచ్చే గాజు సీసాల‌ను చూశారా..? అవును, అవే. అయితే అవి బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌ల‌ర్స్‌లో ఉంటాయి, గ‌మనించారు క‌దా. అవును, గ‌మ‌నించే ఉంటారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ఆ సీసాలు ఆ రంగుల్లో ఎందుకు ఉంటాయో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని ర‌కాల ట్యాబ్లెట్ల‌తోపాటు టానిక్‌ల‌ను బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌ల‌ర్ సీసాలు, బాటిల్స్‌లో నింపుతారు క‌దా. అలా ఎందుకు చేస్తారంటే.. ఆయా రంగుల్లో ఉండే బాటిల్స్‌లో నింపే టానిక్ లేదా ట్యాబ్లెట్లు ఎండ సోకితే కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌రిగి వాటి కెమిక‌ల్ ఫార్ములా మారిపోతుంది. అలాంట‌ప్పుడు అలా ఫార్ములా మారిన మందుల‌ను వేసుకుంటే మ‌న‌కు అపాయం క‌లుగుతుంది. క‌నుక అలా మందులు, టానిక్‌ల‌కు చెందిన ఫార్ములా మార‌కుండా ఉండేందుకు, ఎండ‌వ‌ల్ల కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు గాను ఆయా బాటిల్స్‌, సీసాల‌ను బ్రౌన్ లేదా ఆరెంజ్ క‌ల‌ర్స్‌లో త‌యారు చేస్తారు.

do you know why beer bottles are in green or brown color

బాటిల్స్‌, సీసాల‌ను బ్రౌన్‌, ఆరెంజ్ క‌ల‌ర్స్‌లో త‌యారు చేయ‌డం వ‌ల్ల వాటి గుండా సూర్య కిర‌ణాలు ప్ర‌సారం కావు. ముఖ్యంగా అతి నీల‌లోహిత (అల్ట్రా వ‌యొలెట్‌) కిర‌ణాలు లోప‌లికి ప్ర‌సారం కావు. అలా కాకుండా సీసా, బాటిల్ పై భాగం అడ్డుకుంటుంది. దీంతో కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌ర‌గ‌దు. కాబ‌ట్టి వాటిల్లో ఉంచిన మందుల‌ను, టానిక్‌ల‌ను రోగులు నిర‌భ్యంత‌రంగా తాగ‌వ‌చ్చు. క‌నుక‌నే కొన్ని ట్యాబ్లెట్ల‌ను, టానిక్‌ల‌ను అలా గోధుమ లేదా ఆరెంజ్ క‌ల‌ర్ సీసాలు, బాటిల్స్‌లో స‌ర‌ఫ‌రా చేస్తారు. అయితే కేవ‌లం ఇవే కాదు, బీర్లు కూడా ఇలాంటి బ్రౌన్ క‌ల‌ర్ సీసాల్లోనే ఉంటాయి. దానికి కార‌ణం కూడా ముందు చెప్పిందే. సాధారణ సీసా అయితే ఎండ వ‌ల్ల కెమికల్ రియాక్ష‌న్ జ‌రుగుతుంది. దీంతో బీర్ పాడ‌వుతుంది. అయితే కొన్ని ర‌కాల కంపెనీలు గ్రీన్ క‌ల‌ర్ బీర్ సీసాల‌ను కూడా అందిస్తాయి. దీనికి కూడా కార‌ణం ఇదే. ఇలాంటి డార్క్ క‌ల‌ర్ సీసాలు సూర్య కాంతిని అంత సుల‌భంగా లోప‌లికి పోనివ్వ‌వు. ఫ‌లితంగా లోప‌లి ప‌దార్థం పాడు కాకుండా ఉంటుంది.

Admin

Recent Posts