Radha Krishna : అంత‌గా ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నా.. శ్రీకృష్ణుడు, రాధ ఎందుకు వివాహం చేసుకోలేదు..?

Radha Krishna : స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు నిద‌ర్శ‌నంగా రాధా కృష్ణుల ప్రేమ‌ను చెప్పుకుంటారు. ఎంతో మంది గోపికలు ఉన్న‌ప్ప‌టికీ రాధ‌కు కృష్ణుడి హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మ‌రీ ఇంత‌గా ప్రేమించిన రాధ‌ను శ్రీ కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.. రాధ జ‌న్మ ర‌హ‌స్యం ఏమిటి.. చివ‌రికి రాధ ఏమైంది.. త‌దిత‌ర ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాధ సాక్షాత్తూ మ‌హాల‌క్ష్మి స్వ‌రూపం. శ్రీ కృష్ణుడిగా మ‌హా విష్ణువు భూమి మీద అవ‌త‌రించే ముందు ల‌క్ష్మితో నువ్వు ముందుగా భూమి మీద జ‌న్మించ‌మ‌ని కోర‌తాడు. దీనికి ల‌క్ష్మి మొద‌ట నిరాక‌రించినా చివ‌ర‌కు త‌న ప్రియ‌స‌ఖుని అభ్య‌ర్త‌న‌ను మ‌న్నించి ఓ ష‌ర‌తు విధిస్తుంది.

తాను భూమిపై అవ‌తారం దాల్చినా కృష్ణుడు త‌న ముందుకు వ‌చ్చే వ‌ర‌కు క‌ళ్లు తెర‌వ‌నని చెబుతుంది. ఈ ష‌ర‌తుకు మహా విష్ణువు ఒప్పుకోవ‌డంతో ల‌క్ష్మీ దేవి ప‌ద్మంలో య‌మునా న‌దీ తీరంలో ప‌సి బిడ్డ‌గా ఉద్భ‌విస్తుంది. య‌మునా న‌ది తీరంలో గోవుల‌ను కాస్తున్న వృష‌భానుడు అనే యాద‌వుడికి ప‌ద్మంలో ప‌సి పాప‌గా క‌నిపించ‌డంతో ఆ పాప‌ను ఇంటికి తీసుకెళ్లి రాధ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అయితే పాప పెరిగి పెద్ద‌వుతున్నా క‌ళ్లు తెర‌వ‌క‌పోవ‌డంతో క‌ల‌త చెందిన వృష‌భానుడు అటుగా వ‌చ్చిన నార‌ద మ‌హ‌ర్షితో త‌న పాప‌గురించి చెబుతాడు. రాధ జ‌న్మ ర‌హ‌స్యం ముందే తెలిసిన నార‌ద మ‌హ‌ర్షి వృష‌భానుడితో గోకులంలో ఉన్న య‌శోద నందుల‌తోపాటు అప్పుడే జ‌న్మించిన కృష్ణున్ని ఇంటికి ఆహ్వానించ‌మ‌ని చెబుతాడు.

do you know why Radha Krishna not married
Radha Krishna

వృష‌భానుడు నందుని కుటుంబాన్ని సాద‌రంగా ఆహ్వానించ‌డంతో కుటుంబ స‌మేతంగా అత‌ని ఇంటికి వ‌స్తాడు. బుడిబుడి అడుగుల‌తో క‌న్న‌య్య రాధ‌ను స‌మీపిస్తూ ఉండ‌గా త‌న స్వామి వ‌స్తున్నాడ‌ని గ్ర‌హించిన రాధ క‌న్న‌య్య ద‌గ్గ‌ర‌కు రాగానే ఒక‌సారిగా క‌ళ్లు తెరుస్తుంది. అప్ప‌టినుండి వారిరువురూ ఎటువంటి అర‌మ‌రిక‌లు లేకుండా స‌న్నిహితంగా మెలుగుతుంటారు. కృష్ణుడు త‌న కంటే వ‌య‌సులో కొద్దిగా చిన్న వాడే అయినా త‌న ప్రేమ‌కు వ‌య‌సు అడ్డు రాదంటూ క‌న్న‌య్య‌పై రాధ ప్రేమ‌ను కురిపిస్తుంది. కృష్ణుడు యుక్త వ‌య‌సు రాగానే కంసున్ని సంహ‌రించ‌డానికి మ‌ధుర‌కు వెళ్లే ముందు రాధ ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌న క‌ర్త‌వ్యాన్ని వివ‌రిస్తాడు.

త‌న ప్రియ స‌ఖుడు చెప్పిన దానిని అర్థం చేసుకున్న రాధ బాధ‌తోనే కృష్ణున్ని సాగ‌నంపుతుంది. అలా రాధ కృష్ణుడి ఎట‌బాటుకు గుర‌వుతుంది. రాధ‌ ఎక్క‌డ ఉన్నా తన మ‌న‌సు మాత్రం క‌న్న‌య్య చుట్టూనే తిరుగుతుంటుంది. కృష్ణుడు కూడా త‌ను వేరు రాధ వేరు అని ఎప్పుడూ కూడా భావించ‌లేదు. ఒక‌సారి రాధ క‌న్న‌య్య‌ను మ‌నం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. రాధ మాట‌ల‌కు చిరు న‌వ్వు న‌వ్విన కృష్ణుడు మ‌న శరీరాలు వేరైనా ఆత్మ‌లు ఒక్క‌టే. పెళ్లి అనేది దేహానికి కానీ ఆత్మ‌కు కాద‌ని చెబుతాడు.

శ్రీ కృష్ణుడికి రాధ అత్త‌ అవుతుంద‌ని మ‌రో క‌థ‌నం ఉంది. కృష్ణుడు దూరం అవ్వ‌డంతో ఎప్పుడూ క‌న్నయ్య‌నే ధ్యానిస్తూ ప‌ర‌ధ్యానంలో మునిగి పోతున్న రాధ‌ను చూసి భ‌య‌ప‌డిన ఆమె త‌ల్లిదండ్రులు రాధ‌కు ఇష్టం లేక‌పోయినా చంద్ర‌సేనుడు అనే యాద‌వుడితో వివిహం చేస్తారు. చంద్ర‌సేనుడు కృష్ణుడికి మేన‌మామ అవుతాడు. అలా రాధ కృష్ణుడికి మేన‌త్త అవుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు రాధ యోగ క్షేమాలు తెలుసుకుంటున్న శ్రీ కృష్ణుడు రాధ వృద్ధాప్యంలో ఒక‌సారి ఆమెను క‌లుసుకుంటాడు. మ‌రోవైపు రాధ‌, రుక్మిణిలు ఇద్ద‌రూ ఒకే స్వ‌రూప‌మ‌ని కూడా ప్ర‌చారంలో ఉంది.

D

Recent Posts