Fat Burning Oil : పొట్ట‌, తొడ‌లు, న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వును క‌రిగించే నూనె ఇది.. ఎలా త‌యారు చేసి వాడాలంటే..

Fat Burning Oil : మారిన జీవ‌న‌విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. వాటిల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ అధిక బ‌రువుతోపాటు తొడ‌లు, పిరుదులు, చేతులు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి చూడ‌డానికి అంద వికారంగా కూడా క‌న‌బ‌డుతూ ఉంటారు. బ‌రువు త‌గ్గ‌డం ఎంత క‌ష్ట‌మైన ప‌నో మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంటి చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సులువుగా బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా క‌రిగించుకోవ‌చ్చు. శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డే వారు ఈ చిట్కాను పాటించడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 50 మిల్లీ గ్రాముల‌ ఆవ నూనెను తీసుకోవాలి. త‌రువాత ఈ ఆవ నూనెలో 20 మిల్లీ గ్రాముల కొబ్బ‌రి నూనెను క‌లపాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ వామును, ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క‌ను, త‌రువాత 4 క‌ర్పూరం బిళ్ల‌ల‌ను వేసి క‌లపాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు వేడి చేయాలి. నూనె వేడిగా అయ్యే కొద్దీ దీని నుండి నురుగు రావ‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. నూనెను వేడి చేసిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వ‌డ‌క‌ట్టి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత ఈ నూనెను ఒక గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి.

Fat Burning Oil here it is how to make and use it
Fat Burning Oil

ఇలా నిల్వ చేసుకున్న నూనె నుండి 4 టీ స్పూన్ల నూనెను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న నూనెను గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయాలి. త‌రువాత ఈ నూనెలో 2 టీ స్పూన్ల అల్లం ర‌సాన్ని క‌ల‌పాలి. త‌రువాత ఈ నూనెను కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయిన శ‌రీర భాగాల‌పై రాస్తూ 5 నిమిషాల పాటు నూనె శ‌రీరంలోకి ఇంకేలా బాగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత ఒక కాట‌న్ వ‌స్త్రాన్ని కానీ ప్లాస్టిక్ పేప‌ర్ ను కానీ నూనె రాసిన శ‌రీర భాగం చుట్టూ చుట్టుకుని 3 నుండి 4 గంట‌ల పాటు అలాగే ఉండాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శ‌రీరాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ చేయ‌డం వ‌ల్ల 15 రోజుల్లోనే పేరుకుపోయిన కొవ్వు క‌రిగి శ‌రీరంలో మార్పు రావ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. నూనెను వాడే ప్ర‌తిసారి కూడా అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చేతులు, పొట్ట‌, తొడ‌లు వంటి ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

D

Recent Posts