Doughnuts : బేక‌రీల‌లో ల‌భించే డోన‌ట్స్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?

Doughnuts : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే వాటిల్లో డోన‌ట్స్ ఒక‌టి. డోన‌ట్స్ మ‌న‌కు వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ డోన‌ట్స్ ను అదే రుచితో అచ్చం అలాగే ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్లు,ఈస్ట్ లేకుండా అందరికి అందుబాటులో ఉండే ప‌దార్థాలతో రుచిగా, సుల‌భంగా ఈ డోన‌ట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డోన‌ట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, పంచ‌దార పొడి – 2 టేబుల్ స్పూన్స్, పాలు – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – ఒక‌టింపావు క‌ప్పు, బేకింగ్ పౌడ‌ర్ – అర టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, పంచ‌దార – అర క‌ప్పు.

Doughnuts recipe in telugu easy to make them at home
Doughnuts

డోన‌ట్స్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ను వేయాలి. త‌రువాత ఇందులో పెరుగు, పంచ‌దార పొడి, పాలు పోసి అన్నీ క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత గిన్నెపై ఒక జ‌ల్లెడ‌ను ఉంచి అందులో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించుకోవాలి. ఇలా జ‌ల్లించుకున్న త‌రువాత పిండిని క‌లుపుకోవాలి. త‌గిన‌న్ని పాలు పోస్తూ పిండిని చ‌పాతీ పిండి కంటే మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిని చెక్క మీద వేసి చేత్తో వ‌త్తుతూ సాగ‌దీస్తూ 4 నుండి 5 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. త‌రువాత పిండిని ఒక గిన్నెలో ఉంచి దానిపై నూనె రాసి మూత పెట్టాలి. దీనిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు జార్ లో పంచ‌దార‌ను వేసి 3 సెక‌న్ల పాటు మిక్సీ ప‌ట్టుకుని ఆఫ్ చేయాలి.

ఇలా రెండు నుండి మూడు సార్లు చేసిన త‌రువాత పంచదార‌ను జ‌ల్లించుకోవాలి. ఇప్పుడు పంచ‌దార పొడి వ‌స్తుంది. త‌రువాత దీనిని కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న జ‌ల్లెడ‌తో జ‌ల్లించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బాగా స‌న్న‌గా ఉన్న పంచ‌దార వ‌స్తుంది. ఇలా బాగా స‌న్న‌గా ఉన్న పంచ‌దార‌ను ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని పొడి పిండి చ‌ల్లుకుంటూ పావు ఇంచు మందం ఉండేలా చ‌పాతీ క‌ర్ర‌తో వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న త‌రువాత డోనట్ క‌ట్ట‌ర్ తో లేదా డోన‌ట్ ప‌రిమాణంలో ఉండే మూత‌తో పిండిని క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటి మ‌ధ్య‌లో చిన్న బాటిల్ మూత‌తో క‌ట్ చేసుకోవాలి. ఇలా డోన‌ట్స్ అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వాటిపై త‌డిపిన వ‌స్త్రాన్ని ఉంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె పోసి మ‌ధ్య‌స్థంగా వేడి చేయాలి. నూనె ఇలా వేడ‌య్యాక డోన‌ట్స్ ను వేసి వేయించుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ డోన‌ట్స్ గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత వీటిని ముందుగా త‌యారు చేసుకున్న పంచ‌దారలో వేసి ఒక వైపు మాత్ర‌మే డిప్ చేసుకోవాలి. పంచ‌దార డోన‌ట్స్ కు అంటిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ డోనట్స్ ను చాక్లెట్ సిర‌ప్ తో కూడా గార్నిష్ చేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం బేక‌రీల‌ల్లో ల‌భించే విధంగా ఉండే డోన‌ట్స్ త‌యార‌వుతాయి. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. స్పెషల్ డేస్ లో, బ‌ర్త్ డే స‌మ‌యంలో ఇలా డోనట్స్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts