Drumstick Pickle : మునక్కాయ ప‌చ్చ‌డిని ఇలా చేసి అన్నంలో వేడిగా తినండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Drumstick Pickle : మ‌నం మున‌క్కాయ‌ల‌తో కూర‌ల‌తో పాటు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అన్నంతో తిన‌డానికి ఈ ప‌చ్చ‌డి చాలా చ‌క్క‌గా ఉంటుంది. మున‌క్కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అలాగే ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా మున‌క్కాయ ప‌చ్చ‌డిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చూస్తేనే తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ మున‌క్కాడ ప‌చ్చ‌డిని మ‌రింత సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మునక్కాడ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మున‌క్కాయ‌లు – 3, నాన‌బెట్టిన చింత‌పండు – 50 గ్రా., ఆవాలు – 2 టీ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, దంచిన ధ‌నియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు – 10 నుండి 15, కారం – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్.

Drumstick Pickle recipe in telugu very tasty with rice
Drumstick Pickle

మున‌క్కాడ ప‌చ్చ‌డి తయారీ విధానం..

ముందుగా ఒక మున‌క్కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని ఒక‌టినన్న‌ర ఇంచు పొడ‌వుతో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో నువ్వులు కూడా వేసి వేయించాలి. త‌రువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుని చ‌ల్లారనివ్వాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకునిపొడిగా చేసుకోవాలి. త‌రువాత చింత‌పండు నుండి చిక్క‌టి చింత‌పండు గుజ్జును తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే నూనె వేసి ఉడికించాలి. చింత‌పండులో ఉండే నీరంతా పోయి నూనె పైకి తేలిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత క‌ళాయిలో ముప్పావు క‌ప్పు లేదా 180 గ్రాముల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మున‌క్కాయ ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత అదే నూనెలో శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వెల్లుల్లి రెబ్బ‌లు వేసి తాళింపును చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు, కారం, మిక్సీ ప‌ట్టుకున్న ఆవాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మున‌క్కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత తాళింపు, చింత‌పండు గుజ్జు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ ప‌చ్చ‌డిపై మూత పెట్టి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. ప‌చ్చ‌డి చ‌క్క‌గా ఊరిన త‌రువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ ప‌చ్చ‌డి త‌యారు చేయడానికి మున‌క్కాయ‌ల‌పై ఉండే పొట్టును తీసివేయ‌కూడ‌దు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాడ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts