Dry Rasgulla : చిన్న‌త‌నంలో చాలా మంది తిన్న స్వీట్ ఇది.. ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dry Rasgulla : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో డ్రై ర‌స‌గుల్లాలు కూడా ఒక‌టి. వీటినే నేతి మిఠాయిలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన క్రిస్పీగా లోప‌ల జ్యూసీగా ఉండే నేతి మిఠాయిల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ నేతి మిఠాయిల‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ర‌స‌గుల్లా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒక క‌ప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడ‌ర్ లేదా వంట‌సోడా – అర టీ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, పంచ‌దార – ఒక క‌ప్పు, నీళ్లు – ముప్పావు క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Dry Rasgulla recipe in telugu sweet liked by many
Dry Rasgulla

డ్రై ర‌స‌గుల్లా త‌యారీ విధానం..

ముందుగా ఒక జ‌ల్లెడలో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బేకింగ్ పౌడ‌ర్ వేసి జ‌ల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత నిమ్మ‌ర‌సాన్ని వేసుకోవాలి. ఇప్పుడు త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండి చేతుల‌కు అంటుకుపోకుండా నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో పంచ‌దార‌, నీటిని తీసుకుని వేడి చేయాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత దీనిని మ‌ధ్య‌ప్థ మంట‌పై మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించాలి. పంచ‌దార మిశ్ర‌మం తీగ పాకం కంటే కొద్దిగా త‌క్కువ‌గా, గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ‌గాఉండేలా చూసుకోవాలి. పంచ‌దార మిశ్ర‌మాన్ని ఉడికించిన త‌రువాత ఇందులో యాల‌కుల పొడి, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై కూడా మూత‌ను ఉంచి ప‌క్క‌కు ఉంచాలి.

ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని చేత్తో వ‌త్తుతూ మ‌రో 2 నిమిషాల పాటు క‌లుపుకోవాలి. త‌రువాత పొడి చ‌ల్లుకుంటూ అర ఇంచు మందంతో చ‌పాతీ ఆకారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత చిన్న మూత‌ను తీసుకుని గుండ్ర‌టి ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని క‌ట్ చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ర‌స‌గుల్లాల‌ను విడివిడిగా వేసి వేయించాలి. వీటిని క‌దుపుతూ క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత వీటిని తీసి పంచ‌దార పాకంలో వేసి మూత పెట్టాలి. ఈ ర‌స‌గుల్లాల‌ను 10 నిమిషాల పాటు పంచ‌దార పాకంలోనే నాన‌బెట్టిన త‌రువాత బ‌య‌ట‌కు తీసి ప్లేట్ మీద అత్తుకుపోకుండి విడివిడిగా వేసుకోవాలి. వీటిని ఇలాగే ఒక అర‌గంట‌పాటు ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ర‌స‌గుల్లాలు త‌యారవుతాయి. వీటిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts