ఆధ్యాత్మికం

Eating With Hand : కుడి చేతితో భోజనం చేయడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఇదే..!

Eating With Hand : మనిషి జీవనానికి ఆహారం తీసుకోవడం ఎంతో ఆవశ్యకం. శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి.. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్థోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాల‌తో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరూ తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా.. కుడి చేత్తో తినడం వెనుక మాత్రం.. హిందూ సాంప్రదాయంలో ఆయుర్వేద వైద్యం ప్రకారం కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కథనం చ‌ద‌వండి.

హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతిలో పాజిటివ్ ఎనర్జీ (ధనాత్మక శక్తి) ఉంటుంది. కుడి చేత్తో భోజనం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ఈ శక్తి అందుతుంది. కుడిచేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా వేళ్ల ఆధారం దగ్గర సరస్వతి, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. క‌నుక కుడి చేత్తో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల దైవం ఆశీస్సులు కూడా ల‌భిస్తాయి. యజ్ఞ యాగాలు, దానాలు కూడా కుడి చేత్తోనే చేస్తారు. అదేవిధంగా చేయాలి కూడా. ఎందుకంటే కుడి చేయి ద్వారా ఎంతో విలువైన శక్తి శరీరానికి అందుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం దీన్ని పవిత్రంగా భావిస్తారు.

eating with right hand what is the secret in it

కుడి చేత్తో తినడమంటే సైతాన్‌కు దూరంగా ఉండడమే అని కొన్ని మతాలకు చెందిన వారు విశ్వసిస్తారు. ఎడమ చేయి అపరిశుభ్రంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి ఒక్కరూ కుడి చేత్తోనే తింటారు. కుడి చేత్తో తింటే జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే కొంద‌రు చేతితో కాకుండా స్పూన్‌తో తింటారు. ఇలా చేయ‌రాదు. అలా చేస్తే ఆహారాన్ని అవ‌మానించిన‌ట్లే అవుతుంది. క‌నుక త‌ప్ప‌నిస‌రిగా చేత్తోనే ఆహారం తినాలి. ఎడ‌మ చేత్తోనూ స్పూన్‌ను పట్టుకుని అస‌లు ఆహారాన్ని తిన‌రాదు. ఇలా నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts