Egg Noodles : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే ఎగ్ నూడుల్స్‌.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Egg Noodles : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల వ‌ద్ద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ నూడుల్స్ కూడా ఒక‌టి. ఎగ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ నూడుల్స్ ను మ‌నం కూడా ఇంట్లో చాలా సులభంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ నూడుల్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఎగ్ నూడుల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటిని త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ నూడుల్స్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూడుల్స్ – 150 గ్రా., నీళ్లు – 6 గ్లాసులు, కోడిగుడ్లు – 3, ఉప్పు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన అల్లం – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి – అర టీ స్పూన్, పొడ‌వుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన క్యాప్సికం – 1, క్యాబేజి తురుము – పావు క‌ప్పు, కారం – అర టీ స్పూన్, ట‌మాట సాస్ – 2 టేబుల్ స్పూన్, డార్క్ సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగ‌ర్ – అర టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Egg Noodles recipe make it in street style
Egg Noodles

ఎగ్ నూడుల్స్ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే నూనె, ఉప్పు వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత అందులో నూడుల్స్ వేసి 80 శాతం ఉడికించాలి.త‌రువాత వాటిని వ‌డ‌క‌ట్టి చ‌ల్ల‌టి నీళ్లు పోసి వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఒక గిన్నెలో గుడ్ల‌ను తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. వీటిని ముక్క‌లుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం, వెల్లుల్లి త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత క్యారెట్, క్యాప్సికం, క్యాబేజి వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌రకు వేయించాలి.

త‌రువాత అర టీ స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, కారం, ట‌మాట సాస్, వెనిగ‌ర్ వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ఉడికించిన నూడుల్స్, కోడిగుడ్డు, కొత్తిమీర వేసి పెద్ద మంట‌పై అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ నూడుల్స్ త‌యార‌వుతాయి. వీటిని ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడుల్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

D

Recent Posts