Andhra Chilli Chicken : ఆంధ్రా చిల్లి చికెన్‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Andhra Chilli Chicken : ఆంధ్రా చిల్లీ చికెన్.. చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ చిల్లీ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ చికెన్ క‌ర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా చికెన్ తో రుచిగా క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, స్పైసీగా ఉండే ఈ ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రా చిల్లీ చికెన్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, ప‌చ్చిమిర్చి – 12 నుండి 15, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 20, పుదీనా ఆకులు – గుప్పెడు, కొత్తిమీర ఆకులు – గుప్పెడు, జీడిప‌ప్పు – 6, నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 5, యాల‌కులు – 3, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, చికెన్ మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Andhra Chilli Chicken recipe make in this method
Andhra Chilli Chicken

ఆంధ్రా చిల్లీ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లో ఉప్పు, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెమ్మ‌లు, పుదీనా ఆకులు, జీడిప‌ప్పు, కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంట‌పై వేయించిన త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసుకోవాలి.

త‌రువాత ప‌సుపు, ధ‌నియాల పొడి, కారం, ఉప్పు, చికెన్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్ వేసి క‌లపాలి. దీనిపై మూత పెట్టి 10 నుండి 12 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా చిల్లీ చికెన్ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చిల్లీ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts