viral news

జనాలలోకి వెళ్లిపోయి బీభత్సం సృష్టించిన ఏనుగు.. వైర‌ల్ వీడియో..

బీహార్ రాష్ట్రంలో చాప్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక ఏనుగు ఎంతో రద్దీగా ఉన్న మార్కెట్లోకి వచ్చి అందరిని భయపెట్టింది. అయితే దీనిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. చుట్టుపక్కల ఉండే వస్తువులన్నిటిని తోసుకుంటూ రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది.

ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నో కారులు, బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయాయి. పైగా వాహనాలు యొక్క అద్దాలను పగల కొట్టి అందరినీ భయపెట్టింది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు. మరికొందరు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు.

elephant goes into traffic viral video

ఈ విధంగా బీభత్సం సృష్టించిన ఏనుగు ను చూసి నెటిజెన్లు షాక్ అవుతున్నారు. కాకపోతే అక్కడ ఉన్న మనుషులకు దెబ్బలు కానీ, ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. భవిష్యతులో ఇటువంటి సంఘటనలు జరగకూడదని సరైన చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ చేశారు.

Peddinti Sravya

Recent Posts